Viral Story | రూ. కోటి జరిమానా.. వ‌సూలు చేసిన టికెట్ ఇన్‌స్పెక్ట‌ర్

Viral Story |  రైల్వే స్టేష‌న్ల‌లోని( Railway Stations ) ఎంట్రెన్స్, ఎగ్జిట్ పాయింట్ల వ‌ద్ద టికెట్ ఇన్‌స్పెక్ట‌ర్స్( Ticket Inspectors ) ప్ర‌యాణికుల‌ను త‌నిఖీ చేస్తుంటారు. ప్లాట్ ఫాం టికెట్, ప్యాసింజ‌ర్ టికెట్ల‌ను త‌నిఖీ చేస్తూ.. టికెట్ లేని ప్ర‌యాణికుల‌కు జ‌రిమానా( Fine ) విధిస్తుంటారు. అంతే కాదు రైళ్ల‌లోనూ టికెట్ లేకుండా ప్ర‌యాణించే వారికి కూడా జ‌రిమానా విధిస్తుంటారు టికెట్ ఇన్‌స్పెక్ట‌ర్లు. ఓ టికెట్ ఇన్‌స్పెక్ట‌ర్ ఇలా జ‌రిమానాలు విధించి, ఏకంగా రూ. కోటి […]

Viral Story | రూ. కోటి జరిమానా.. వ‌సూలు చేసిన టికెట్ ఇన్‌స్పెక్ట‌ర్

Viral Story | రైల్వే స్టేష‌న్ల‌లోని( Railway Stations ) ఎంట్రెన్స్, ఎగ్జిట్ పాయింట్ల వ‌ద్ద టికెట్ ఇన్‌స్పెక్ట‌ర్స్( Ticket Inspectors ) ప్ర‌యాణికుల‌ను త‌నిఖీ చేస్తుంటారు. ప్లాట్ ఫాం టికెట్, ప్యాసింజ‌ర్ టికెట్ల‌ను త‌నిఖీ చేస్తూ.. టికెట్ లేని ప్ర‌యాణికుల‌కు జ‌రిమానా( Fine ) విధిస్తుంటారు. అంతే కాదు రైళ్ల‌లోనూ టికెట్ లేకుండా ప్ర‌యాణించే వారికి కూడా జ‌రిమానా విధిస్తుంటారు టికెట్ ఇన్‌స్పెక్ట‌ర్లు. ఓ టికెట్ ఇన్‌స్పెక్ట‌ర్ ఇలా జ‌రిమానాలు విధించి, ఏకంగా రూ. కోటి వ‌సూలు చేసింది. ఈ సంద‌ర్భంగా రైల్వే మంత్రిత్వ శాఖ( Ministry of Railways ) ఆమె క‌థ‌నాన్ని త‌న ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. ప్ర‌స్తుతం ఆ టికెట్ ఇన్‌స్పెక్ట‌ర్ స్టోరీ సోష‌ల్ మీడియా( Social Media )లో వైర‌ల్ అవుతోంది.

రోస‌లిన్ అరోకియా మేరీ( Rosaline Arokia Mary ) స‌ద‌ర‌న్ రైల్వే( Southern Railway )లో చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తోంది. ప్లాట్‌ఫాంల‌పై, రైళ్ల‌ల్లో టికెట్లు లేకుండా ప్ర‌యాణిస్తున్న ప్ర‌యాణికుల నుంచి ఆమె అత్య‌ధికంగా రూ. 1.03 కోట్ల జ‌రిమానాలు వ‌సూలు చేసింది. ఈ సంద‌ర్భంగా రైల్వే మంత్రిత్వ శాఖ రోస‌లిన్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. రోస‌లిన్ చిత్త‌శుద్ధితో త‌న విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. ఇండియ‌న్ రైల్వేస్‌లోనే భారీ స్థాయిలో( రూ. 1.03 కోట్లు) జ‌రిమానాలు వ‌సూలు చేసిన తొలి మ‌హిళా టికెట్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా రికార్డు సృష్టించింద‌ని పేర్కొంది.

ప్ర‌స్తుతం రోస‌లిన్ స్టోరీ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. భార‌త‌దేశం మ‌రింత శ‌క్తిని సాధించాలంటే ఇలాంటి మ‌హిళ‌లు దేశానికి అవ‌స‌రం. ఇలా చిత్త‌శుద్ధితో అంద‌రూ ప‌ని చేస్తే దేశం త‌ప్ప‌కుండా అభివృద్ధి చెందుత‌ద‌ని ఓ నెటిజ‌న్ పేర్కొన్నాడు. విధుల ప‌ట్ల ఆమె నిబ‌ద్ధ‌త‌, చిత్త‌శుద్ధిని చూసి గ‌ర్వంగా ఫీల‌వుతున్నాన‌ని మ‌రొక‌రు రాసుకొచ్చారు. మొత్తంగా రోస‌లిన్‌కు సామాజిక మాధ్య‌మాల్లో శుభాకాంక్ష‌లు వెలువెత్తుతున్నాయి.