Viral Video | సర్కస్‌లో ట్రైనర్‌పై పులి ఎదురుదాడి.. వీడియో వైరల్‌

Viral Video | సర్కస్‌లో ఏనుగులు, పులులు, కోతుల తదితర జంతువులతో విన్యాసాలు చూసేందుకు భలే గమ్మత్తుగా ఉంటాయి. జంతువులతో సర్కస్‌ ట్రైనర్స్‌తో ఎంతో నేర్పుతో వాటితో జిమ్మిక్కులు చేయిస్తుంటారు. సర్కస్ ట్రైనర్స్‌కి ఆ పని కత్తిమీద సాములాంటిదే. ఎందుకంటే క్రూరజంతువులతో సర్కస్ చేయించే సమయంలో పులులతో, ఏనుగులతో చాలా ఓపిగ్గా, అప్రమత్తంగా ఉంటూ వాటిని మచ్చిక చేసుకొని రంగంలోకి దిగాలి. అయినా సరే కొన్నిసార్లు జంతువులు ఎప్పుడు, ఎందుకు, ఎలా వ్యవహరిస్తాయో తెలియదు. చెప్పినట్టు వినకుండా […]

Viral Video | సర్కస్‌లో ట్రైనర్‌పై పులి ఎదురుదాడి.. వీడియో వైరల్‌

Viral Video | సర్కస్‌లో ఏనుగులు, పులులు, కోతుల తదితర జంతువులతో విన్యాసాలు చూసేందుకు భలే గమ్మత్తుగా ఉంటాయి. జంతువులతో సర్కస్‌ ట్రైనర్స్‌తో ఎంతో నేర్పుతో వాటితో జిమ్మిక్కులు చేయిస్తుంటారు. సర్కస్ ట్రైనర్స్‌కి ఆ పని కత్తిమీద సాములాంటిదే. ఎందుకంటే క్రూరజంతువులతో సర్కస్ చేయించే సమయంలో పులులతో, ఏనుగులతో చాలా ఓపిగ్గా, అప్రమత్తంగా ఉంటూ వాటిని మచ్చిక చేసుకొని రంగంలోకి దిగాలి.

అయినా సరే కొన్నిసార్లు జంతువులు ఎప్పుడు, ఎందుకు, ఎలా వ్యవహరిస్తాయో తెలియదు. చెప్పినట్టు వినకుండా ఎదురుతిరిగాయంటే మాత్రం ఇక ట్రైనర్లకు భూమిపై నూకలు చెల్లినట్టే. మరీ ముఖ్యంగా పులులు లాంటి కృూరమృగాలతో డీల్ చేయడం చాలా కష్టం.

ఇదంతా ఎందుకుంటారా? సర్కర్‌లో రెండు పులులతో విన్యాసాలు చేయిస్తుండగా.. ఓ పులి ట్రైనర్‌పై దాడికి యత్నించింది. ట్రైనర్ ఒక పులితో సర్కస్ చేస్తుండగానే.. ఆ వెనకాలే ఉన్న మరో పులి అతని కాలును పట్టుకొని లాగింది. పులి దాడిలో అతడి మెడ, కాలుకి గాయాలయ్యాయి. ఇటాలియన్ ప్రావిన్స్ లోని లెస్సిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పులి దాడిలో గాయపడిన ట్రైనర్‌పేరు ఇవాన్ ఓర్ఫి. ట్రైనర్‌పై పులి దాడి చేయడం చూసి గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులంతా షాక్‌కు గురయ్యారు. ఒక్కసారిగా అరుపులు, కేకలతో సర్కస్ ప్రాంగణమంతా మార్మోగిపోవడం. పులి ఇవాన్ ఓర్ఫిపై దాడి చేయడం చూసిన అతడి అసిస్టెంట్ వేగంగా స్పందించడం ప్రాణాలతో బయటపడ్డాడు.

ఆ తర్వాత అతన్ని సర్కస్ నిర్వాహకులు ఆస్పత్రికి తరలించారు. పులి దాడిలో అతడు తీవ్రంగా గాయపడినప్పటికీ.. అతడి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.