ఇందిరా గాంధీపై అభిమానంతో రాజకీయాల్లోకి నటి జమున.. రాజమండ్రి నుంచి లోక్‌సభకు
Actress Jamuna | సినీయర్ నటి జమున.. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా.. రాజకీయాల్లో కూడా సేవలందించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అంటే జమునకు ఎంతో ఇష్టం. ఆమెపై అభిమానంతోనే 1980లో జమున కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో రాజమండ్రి నియోజకవర్గం నుంచి జమున లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1991లో అదే నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొంతకాలం పాటు జమున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత భారతీయ […]

Actress Jamuna | సినీయర్ నటి జమున.. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా.. రాజకీయాల్లో కూడా సేవలందించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అంటే జమునకు ఎంతో ఇష్టం. ఆమెపై అభిమానంతోనే 1980లో జమున కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో రాజమండ్రి నియోజకవర్గం నుంచి జమున లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1991లో అదే నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొంతకాలం పాటు జమున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో జమునా చేరి ప్రచారం చేశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున హైదరాబాద్‌లోని తన స్వగృహంలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. జమున మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 1936, ఆగస్టు 30న హంపీలో జన్మించారు.
1953లో పుట్టిల్లు సినిమాతో ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తెరంగ్రేటం చేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో జమున నటించారు. మొత్తం 198 సినిమాల్లో జమున నటించారు.