Traffic Restrictions | పంద్రాగ‌స్టు వేడుక‌లు.. గోల్కొండ వ‌ద్ద ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions | గోల్కొండ కోట వేదిక‌గా పంద్రాగ‌స్టు వేడుక‌లను నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా గోల్కొండ ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఆంక్ష‌లు ఆగ‌స్టు 15న ఉద‌యం 7 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు అమ‌ల్లో ఉండ‌నున్న‌ట్లు తెలిపారు. ఆంక్ష‌ల స‌మ‌యంలో రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ వ‌చ్చే రోడ్డును పూర్తిగా మూసివేయ‌నున్నారు. వేడుక‌ల‌కు […]

  • By: raj    latest    Aug 13, 2023 1:40 PM IST
Traffic Restrictions | పంద్రాగ‌స్టు వేడుక‌లు.. గోల్కొండ వ‌ద్ద ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions |

గోల్కొండ కోట వేదిక‌గా పంద్రాగ‌స్టు వేడుక‌లను నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా గోల్కొండ ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈ ఆంక్ష‌లు ఆగ‌స్టు 15న ఉద‌యం 7 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు అమ‌ల్లో ఉండ‌నున్న‌ట్లు తెలిపారు. ఆంక్ష‌ల స‌మ‌యంలో రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ వ‌చ్చే రోడ్డును పూర్తిగా మూసివేయ‌నున్నారు.

వేడుక‌ల‌కు పాస్‌లు ఉన్న‌వారికే అనుమ‌తించ‌నున్నారు. పాస్‌లు ఇప్ప‌టికే జారీ చేశారు అధికారులు. పాసులు క‌లిగిన వారు బంజారాహిల్స్ – మెహిదీప‌ట్నం – రేతిబౌలి – నాలాన‌గ‌ర్ – లంగ‌ర్ హౌస్ బ్రిడ్జి – రాందేవ్‌గూడ మీదుగా గోల్కొండ చేరుకోవాల‌ని సూచించారు.

పార్కింగ్ స్థ‌లాలు ఇవే..

ఏ గోల్డ్ పాస్ క‌లిగిన వారు కోట ప్ర‌ధాన ద్వారం ఎదురుగా ఉన్న స్థ‌లంలో పార్కింగ్ చేసుకోవాలి.

పింక్ పాస్ వారు గోల్కొండ బస్టాప్‌లో, బీ బ్లూ పాస్ క‌లిగిన వారు ఫుట్ బాల్ మైదానంలో పార్కింగ్ చేసుకోవాల‌ని సూచించారు.

సీ గ్రీన్ పాస్ క‌లిగిన వారు సెవెన్ టూంబ్స్, బంజారా ద‌ర్వాజా మీదుగా వ‌చ్చి ఓవైసీ జీహెచ్ఎంసీ మైదానంలో పార్కింగ్ చేసుకోవాలి.

డీ రెడ్ పాస్ క‌లిగిన వారు షేక్‌పేట – టోలీచౌకీ – బంజారా ద్వ‌రాజా మీదుగా వ‌చ్చి ప్రియ‌ద‌ర్శిని స్కూల్ మైదానంలో పార్కింగ్ చేసుకోవాలి.

ఈ బ్లాక్ పాస్ క‌లిగిన సాధార‌ణ ప్ర‌జ‌లు హుడా పార్కులో పార్కింగ్ చేసుకొని వేడుక‌ల‌కు హాజ‌రు కావాలని పోలీసులు సూచించారు.