Train Accident | బాలాసోర్ రైలు ప్రమాదంపై FIR నమోదు చేసిన CBI.. చేపట్టిన విచారణ
Train Accident విధాత: బాలాసోర్ రైలు ప్రమాదంపై సీబీఐ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. కేంద్ర రైల్వేశాఖ విచారణ చేయాలని సీబీఐని ఆదేశించింది. దీనికి ఒడిశా ప్రభుత్వం కూడా అంగీకరించింది. దీంతో డీఓపీటీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. ఒడిశాలోని బాలాసోర్‌లో గత శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో 270 మందికి పైగా పౌరులు చనిపోయిన విషయం అందరికి తెలిసిందే. ఈ ప్రమాదం ప్రమాదవ శాత్తు జరిగిందా? కుట్రకోణం ఏమైనా […]

Train Accident
విధాత: బాలాసోర్ రైలు ప్రమాదంపై సీబీఐ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. కేంద్ర రైల్వేశాఖ విచారణ చేయాలని సీబీఐని ఆదేశించింది. దీనికి ఒడిశా ప్రభుత్వం కూడా అంగీకరించింది. దీంతో డీఓపీటీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది.
ఒడిశాలోని బాలాసోర్‌లో గత శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో 270 మందికి పైగా పౌరులు చనిపోయిన విషయం అందరికి తెలిసిందే. ఈ ప్రమాదం ప్రమాదవ శాత్తు జరిగిందా? కుట్రకోణం ఏమైనా ఉందా? అన్న అనుమానంతో కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించింది.
దర్యాప్తు చేపట్టిన సీబీఐ బృందం మంగళవారం ప్రమాద స్థలానికి చేరుకున్నది. రైలు ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన ఉన్నత స్థాయి టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదికతో పాటు ఈ ప్రమాదం మానవ తప్పిదమా? లేక ఉద్దేశ పూర్వకంగా ఎవరైనా చేశారా? ఇందులో ఉగ్ర కోణం ఉన్నదా? అన్న దిశగా సీబీఐ విచారణ చేయనున్నది.