TS EAMCET RESULT | ఈ నెల 25న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు
వెల్లడించిన ఎంసెట్ కన్వినర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ విధాత: తెలంగాణ ఎంసెట్ (TS EAMCET RESULT) ఫలితాలు ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వినర్ ప్రొఫెసర్ బి. డీన్ కుమార్ తెలిపారు. 25వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి వాకాటికరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, జేఎన్టీయూ హైదరాబాద్ వీసీ […]
- వెల్లడించిన ఎంసెట్ కన్వినర్ ప్రొఫెసర్ డీన్ కుమార్
విధాత: తెలంగాణ ఎంసెట్ (TS EAMCET RESULT) ఫలితాలు ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వినర్ ప్రొఫెసర్ బి. డీన్ కుమార్ తెలిపారు. 25వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి వాకాటికరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, జేఎన్టీయూ హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తదితరులు ఈ ఫలితాలను విడుదల చేస్తారన్నారు. జేఎన్టీయూ హైదరాబాద్లోని గోల్డెన్ జూబ్లీ హాలులో ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram