TSPSC | గ్రూప్-4.. తొలిరోజే 5,50,171 హాల్ టికెట్లు డౌన్‌లోడ్

TSPSC | విధాత: గ్రూప్-4 రాత‌ప‌రీక్ష‌ను ప‌క‌డ్బందీగా నిర్వ‌హించేందుకు టీఎస్‌పీఎస్సీ తీవ్రంగా శ్ర‌మిస్తోంది. 8180 పోస్టుల‌కు గానూ 9,51,204 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. తొలిరోజే 5,50,171 మంది అభ్య‌ర్థులు త‌మ హాల్ టికెట్ల‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు. మిగిలిన నాలుగు ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు కూడా ఈ రెండు, మూడు రోజుల్లో డౌన్ లోడ్ చేసుకోనున్నారు. దీన్ని బ‌ట్టి చూస్తుంటే.. ప‌రీక్ష‌కు ప్ర‌తిఒక్క‌రూ హాజ‌ర‌య్యేలా ఉంది. ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌తి అభ్య‌ర్థికి […]

TSPSC | గ్రూప్-4.. తొలిరోజే 5,50,171 హాల్ టికెట్లు డౌన్‌లోడ్

TSPSC |

విధాత: గ్రూప్-4 రాత‌ప‌రీక్ష‌ను ప‌క‌డ్బందీగా నిర్వ‌హించేందుకు టీఎస్‌పీఎస్సీ తీవ్రంగా శ్ర‌మిస్తోంది. 8180 పోస్టుల‌కు గానూ 9,51,204 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. తొలిరోజే 5,50,171 మంది అభ్య‌ర్థులు త‌మ హాల్ టికెట్ల‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు.

మిగిలిన నాలుగు ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు కూడా ఈ రెండు, మూడు రోజుల్లో డౌన్ లోడ్ చేసుకోనున్నారు. దీన్ని బ‌ట్టి చూస్తుంటే.. ప‌రీక్ష‌కు ప్ర‌తిఒక్క‌రూ హాజ‌ర‌య్యేలా ఉంది. ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌తి అభ్య‌ర్థికి టీఎస్‌పీఎస్సీ మేసేజ్‌లు పంపిస్తూ అప్ర‌మ‌త్తం చేస్తుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 2,878 ప‌రీక్షా కేంద్రాలు

రాష్ట్ర వ్యాప్తంగా 2,878 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద బందోబ‌స్తు, ఇత‌ర‌త్రా అంశాల‌పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స‌మీక్షించారు.

పరీక్ష నిర్వహణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మహిళా అభ్యర్థులను తనిఖీ చేసేందుకు తప్పనిసరిగా మహిళా అధికారులను అందుబాటులో ఉంచాలని సూచించారు.

వేలి ముద్ర‌ త‌ప్ప‌నిస‌రి..

గ్రూప్-4కు భారీ సంఖ్య‌లో అభ్య‌ర్థులు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉన్నందున స‌మ‌యాభావం దృష్ట్యా బ‌యోమెట్రిక్‌కు బ‌దులుగా వేలిముద్ర తీసుకోనున్నారు. దీంతో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి 33 జిల్లాల కలెక్టరేట్లలో ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేశారు.