పార్కింగ్ ఏరియాలో సర్పాల సయ్యాట.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో..!
Viral Video | సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో ఫన్నీ వీడియోలు, పెంపుడు జంతువుల వీడియోలు చూసేవుంటారు. అలాగే పాములకు సంబంధించిన వీడియోలు సైతం తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా పాములకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఓ ఇంట్లోని పార్కింగ్ ఏరియాలో రెండు పాములు పెనవేసుకొని.. సయ్యాటలాడుతున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నది. ‘గుంజన్ కపూర్’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. నెటిజన్స్ […]

Viral Video | సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో ఫన్నీ వీడియోలు, పెంపుడు జంతువుల వీడియోలు చూసేవుంటారు. అలాగే పాములకు సంబంధించిన వీడియోలు సైతం తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా పాములకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఓ ఇంట్లోని పార్కింగ్ ఏరియాలో రెండు పాములు పెనవేసుకొని.. సయ్యాటలాడుతున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నది. ‘గుంజన్ కపూర్’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. నెటిజన్స్ నుంచి మంచి స్పందన వస్తున్నది. ఈ వీడియోను ఇప్పటికే దాదాపు మిలియన్ మంది వీక్షించారు.
అయితే, పార్కింగ్ ఏరియాలో ఉన్న పాములు చూసిన చాలా మంది భయపడ్డట్లు పేర్కొన్నారు. అయితే, చాలాసార్లు ఇలా పాములు పెనవేసుకొని ఉండడం చూసి అవి డాన్స్ చేసున్నాయని అనుకుంటారని, లేదంటే ఇంకొన్నిసార్లు అవి సంభోగంలో పాల్గొంటున్నాయని అనుకుంటారు. కానీ, శాస్త్రవేత్తలు మాత్రం వీటికి భిన్నంగా కొత్త విషయం చెప్పారు.
అదేంటంటే.. ఒకే జాతికి చెందిన రెండు పాములు.. ఇంకా చెప్పాలంటే రెండు ఆడపాములు కానీ.. రెండు మగ పాములు ఇలా ఒకదానినొకటి అల్లుకుని పోటీ పడుతున్నాయంటే.. దానర్థం కుస్తీ పడుతున్నాయని అర్థమని పేర్కొన్నారు. అవి ఒకదానితో మరొకటి ఫైటింగ్ చేస్తున్నాయని అనుకోవచ్చని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.