నాగార్జునసాగర్: కృష్ణానదిలో కూకట్‌ప‌ల్లి వాసి మృతదేహం

విధాత: నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం సాయంత్రం కృష్ణా నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని సాగర్ పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా సాగర్ ఎస్ఐ రాంబాబు మాట్లాడుతూ హిల్ కాలనీలోని పాత ఫిల్టర్ హౌస్ వెనుక భాగాన కృష్ణా నదిలో సుమారు 48 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని చూసినట్లుగా స్థానికులు స‌మాచారం అందించారన్నారు. దీంతో ఆ ప్రాంతానికి చేరుకుని మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీశామ‌న్నారు. మృతదేహంపై సెక్యూరిటీ వాళ్ళు వేసుకునే గ్రీన్ కలర్ పాయింట్, […]

నాగార్జునసాగర్: కృష్ణానదిలో కూకట్‌ప‌ల్లి వాసి మృతదేహం

విధాత: నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం సాయంత్రం కృష్ణా నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని సాగర్ పోలీసులు గుర్తించారు.

ఈ సందర్భంగా సాగర్ ఎస్ఐ రాంబాబు మాట్లాడుతూ హిల్ కాలనీలోని పాత ఫిల్టర్ హౌస్ వెనుక భాగాన కృష్ణా నదిలో సుమారు 48 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని చూసినట్లుగా స్థానికులు స‌మాచారం అందించారన్నారు.

దీంతో ఆ ప్రాంతానికి చేరుకుని మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీశామ‌న్నారు. మృతదేహంపై సెక్యూరిటీ వాళ్ళు వేసుకునే గ్రీన్ కలర్ పాయింట్, బెల్టుతోపాటు చెక్స్ డిజైన్ ఉన్న చొక్కాను ధరించి ఉన్నాడన్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా వివ‌రించారు.

అయితే నాగార్జునసాగర్‌లోని కృష్ణానదిలో దొరికిన గుర్తుతెలియని మృతదేహం వివరాలను సాగర పోలీసులు కనుగొన్నారు. హైదరాబాద్‌ కూకట్‌ప‌ల్లికి చెందిన కోటేశ్వరరావుగా గుర్తించారు.