తారకరత్నకు అన్నీ తానై.. నేడు కుటుంబానికి పెద్ద దిక్కైన బాలయ్య
విధాత, సినిమా: దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న రెండు రోజుల క్రితం శివైక్యమైన విషయం తెలిసిందే. తారకరత్న క్షేమంగా రావాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. ఎందుకంటే అతని మంచితనం అలాంటిది. ఆయన ఎవరికి ఏం చేశాడనేది పక్కన పెడితే.. ఎవరికీ కీడు మాత్రం చేయలేదు. అందుకే అందరూ ఆయన ఆస్పత్రిలో ఉంటే.. కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. ఇక తారకరత్న అంటే బాలకృష్ణకు చాలా ఇష్టం. తన కుమారుడిపై ఎంత అభిమానమో […]

విధాత, సినిమా: దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న రెండు రోజుల క్రితం శివైక్యమైన విషయం తెలిసిందే. తారకరత్న క్షేమంగా రావాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. ఎందుకంటే అతని మంచితనం అలాంటిది. ఆయన ఎవరికి ఏం చేశాడనేది పక్కన పెడితే.. ఎవరికీ కీడు మాత్రం చేయలేదు. అందుకే అందరూ ఆయన ఆస్పత్రిలో ఉంటే.. కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు.
ఇక తారకరత్న అంటే బాలకృష్ణకు చాలా ఇష్టం. తన కుమారుడిపై ఎంత అభిమానమో అంతటి అభిమానం ఆయనకు తారకరత్నపై ఉంది. ఆ విషయం తారకరత్న హాస్పిటల్ పాలైనప్పటి నుంచి అందరూ చూస్తూనే ఉన్నారు. తారకరత్న గుండెపోటుతో కుప్పకూలినప్పటి నుంచి బెంగుళూరు హాస్పిటల్‌లో జాయిన్ చేసే వరకు, ఆ తర్వాత అన్నీ తానై ఏర్పాట్లు చూసుకున్నారు.
తారకరత్న విషయంలో అన్ని విషయాలలోనూ బాలయ్యే ప్రదానంగా కనిపించారు. బెంగళూరులో చికిత్స పొందుతున్న సమయంలో అక్కడే ఉండి డాక్టర్లతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకున్నారు. తారకరత్నకు మెరుగైన వైద్యం అందించేందుకు చాలా ప్రయత్నించారు. విదేశాల నుంచి వైద్య నిపుణులను సైతం రప్పించారు.
త్వరగా కోలుకోవాలని చిత్తూరు జిల్లా మృత్యుంజయ ఆలయంలో 44 రోజులు జ్యోతిని వెలిగించే కార్యక్రమం చేపట్టారు. హోమాలు, జపాలు, అఖండ జ్యోతి, మృత్యుంజయ స్తోత్రం వంటివి ఎన్నో ఆయన చేశారు. చివరకు ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
తారకరత్న చనిపోవడాన్ని బాలయ్య తట్టుకోలేకపోతున్నారు. తారకరత్న అకాల మరణం నేపథ్యంలో బాలయ్య మరో నిర్ణయం తీసుకున్నారు. తారకరత్న కుటుంబానికి అండగా తాను ఉంటానని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ముగ్గురు పిల్లల బాధ్యతలను చూసుకుంటానని చెప్పినట్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా మీడియాకు తెలిపారు.
ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇక నుంచి వారి పూర్తి బాధ్యతలు తనవేనని బాలయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్‌స్టాపబుల్ తర్వాత బాలయ్యను అంతగా అందరూ ఓన్ చేసుకుంది తారకరత్న విషయంలోనే అని చెప్పుకోవాలి. అంతగా ఒక పెద్దన్న పాత్రని బాలయ్య పోషించారు.