Aliens | అమెరికాకు అంత బ‌లం లేదు..

ఉన్న‌ట్టుండి ఏదో లోకం నుంచి గ్ర‌హాంత‌ర వాసులు (Aliens) భూమి మీద‌కు వ‌చ్చి దాడి చేయ‌డం.. దానికి కొంత‌మంది హీరోలు అడ్డుకుని ప్ర‌పంచాన్ని ర‌క్షించ‌డం.

  • By: Somu    latest    Jan 29, 2024 10:50 AM IST
Aliens | అమెరికాకు అంత బ‌లం లేదు..
  • గ్రహాంత‌ర వాసుల‌ను ఆ దేశ సైన్యం ఎదుర్కోలేందంటున్న నివేదిక‌

Aliens | విధాత‌: ఉన్న‌ట్టుండి ఏదో లోకం నుంచి గ్ర‌హాంత‌ర వాసులు (Aliens) భూమి మీద‌కు వ‌చ్చి దాడి చేయ‌డం.. దానికి కొంత‌మంది హీరోలు అడ్డుకుని ప్ర‌పంచాన్ని ర‌క్షించ‌డం.. హాలీవుడ్‌లో ఇదే స్టోరీతో చాలా సినిమాలు ఇప్ప‌టికే చాలా వ‌చ్చాయి, రానున్నాయి. ఏ ప్ర‌భుత్వ సాయమూ లేకుండా వారే వివిధ ఆయుధాల‌తో గ్ర‌హాంతర వాసుల ప‌ని ప‌డ‌తారు. అయితే నిజంగా ఇలా ఏదైనా గ్ర‌హాంత‌ర‌వాసుల జాతి భూమి మీద‌కు వ‌చ్చి యుద్ధం ప్ర‌క‌టిస్తే ప‌రిస్థితి ఏమిట‌న్న‌దానిపై ఒక ప‌రిశోధ‌న జ‌రిగింది. అందులో ప్ర‌పంచంలో అత్యంత శ‌క్తిమంత‌మైన సైనిక పాట‌వం ఉన్న అమెరికా (America) సైన్యం కూడా గ్ర‌హాంత‌ర వాసులను అడ్డుకోలేద‌ని తేలింది.


చ‌రిత్ర‌లో ఆ నోటా ఈ నోటా విని, కాస్త న‌మ్మ‌దగిన‌విగా ఉన్న యూఎఫ్ఓ అనుభ‌వాల‌ను సేక‌రించి.. అస‌లు గ్ర‌హాంత‌ర‌వాసులు ఉంటే వాటి సైనిక పాట‌వం ఏ స్థాయిలో ఉంటుందో ప‌రిశోధ‌కులు అంచ‌నా వేశారు. ఇలాంటి ముప్పు క‌నుక ఒక‌వేళ మ‌న ముందు నిలిస్తే దానిని ఎదుర్కోవ‌డానికి అమెరికా ర‌క్ష‌ణ శాఖ సైతం ఒక ప్ర‌త్యేక విభాగాన్ని 2022 జులైలో ఏర్పాటు చేసింది. ఆల్ డొమైన్ అనోమొలీ రిస‌ల్యూష‌న్ ఆఫీస్ (ఏఏఆర్ఓ) అనే ఈ వ్య‌వ‌స్థ యూఎఫ్ఓల నుంచి వ‌చ్చే ముప్పును మ‌దింపు చేసి నివేదిక‌లు ఇస్తుంది. ఈ నివేదిక‌లను అధ్య‌య‌నం చేసిన ఆఫీస్ ఆఫ్ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌.. అమెరికా సైన్యం స‌మ‌ర్థ‌త‌పై అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఒక వేళ గ్ర‌హాంత‌ర వాసులు దాడి చేస్తే తిప్పికొట్టే శ‌క్తి వారికి లేద‌ని త‌న నివేదిక‌లో అభిప్రాయ‌ప‌డ్డారు.


ఎవ‌ల్యూష‌న్ ఆఫ్ ద డీఓడీ యాక్ష‌న్ రిగార్డింగ్ అన్ఐడెంటిఫైడ్ అనోమ‌ల‌స్ ఫినామినా పేరుతో ఈ నివేదిక‌ను విడుద‌ల చేశారు. ఈ త‌ర‌హా ముప్పు ఎదురైన‌ప్పుడు ఏం చేయాల‌నేదానిపై ఒక ప్ర‌త్యేక ప్ర‌ణాళిక అంటూ ఏమి లేద‌ని అందులో పేర్కొన్నారు. ‘ఇంత ర‌హ‌స్య‌మైన నివేదిక‌ను మేము ప్ర‌జా హితార్థం విడుద‌ల చేస్తున్నాం. యూఎఫ్ఓల గురించి మేము ఎంత ప‌రిశోధ‌న చేస్తున్నామ‌నే విష‌యం పౌరుల‌కు తెలియాలి’ అని ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ రాబ‌ర్ట్ పీ స్టార్చ్ వెల్ల‌డించారు. ఏదైనా అనుకోని, ఇప్ప‌టి వ‌ర‌కు లేని ముప్పును ఎదుర్కోవాల్సి వ‌స్తే ఏమి చేయాల‌నేదానిపై కొన్ని సూచ‌న‌లు చేసిన‌ట్లు పేర్కొన్నారు.