Health Tips | రాత్రి బెడ్‌లైట్ వేసుకొని పడుకుంటున్నారా..? గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 50 శాతం అధికమట జాగ్రత్త
రాత్రి బెడ్‌లైట్ వేసుకుని పడుకుంటున్నారా? జాగ్రత్త! దీనివల్ల గుండె జబ్బుల ముప్పు 50% పైగా పెరుగుతుందని శాస్త్రవేత్తల హెచ్చరిక. చీకటిలో నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు తాజా అధ్యయనం వివరాలు ఇక్కడ..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో గుండె జబ్బు ( heart disease) కూడా ఒకటి. ప్రపంచంలో అధిక శాతం దేశాల్లో గుండె జబ్బుల కారణంగా చాలా మంది మృతి చెందుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో యుక్త వయసు వారే ఎక్కువగా గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారు. హార్ట్‌ఎటాక్ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సమస్యగా మారింది. అప్పటి వరకూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవలే అనేకం వెలుగుచూశాయి.
గుండె జబ్బులు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉండడం, పొగ తాగడం, మద్యం సేవించడం, ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉండడం, రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం, ఆలస్యంగా నిద్రించడం వంటి కారణాల వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి. మన అలవాట్లు కూడా గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. అందులో ఒకటి బెడ్‌లైట్.
చాలా మందికి రాత్రిపూట లైట్ వేసుకోనిదే నిద్ర పట్టదు (Sleeping). మరికొంతమంది ఫోన్‌లో పాటలు వింటూ నిద్రలోకి జారుకుంటారు. ఇలా చేయడం వల్ల కూడా గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. చిన్నపాటి వెలుతురు, సంగీతం వింటూ నిద్రపోవటం ఆరోగ్యానికి మంచిది కాదని జామా నెట్‌వర్క్ ఓపెన్ అధ్యయనం హెచ్చరిస్తోంది. శాస్త్రవేత్తలు దాదాపు 90 వేల మంది గుండె పనితీరును అధ్యయం చేయడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
గుండె, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బెడ్‌రూమ్‌లను పూర్తిగా చీకటిగా ఉంచాలని సదరు అధ్యయనం సూచిస్తోంది. పూర్తిగా చీకట్లో నిద్రపోయిన వాళ్లతో పోలిస్తే, రాత్రంతా బెడ్‌లైట్ లేదా సాఫ్ట్ మ్యూజిక్ వింటూ నిద్రపోయే వాళ్లలో గుండె జబ్బుల ముప్పు 30 శాతం ఎక్కువగా ఉందని తేలింది. అలాగే బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బుల ముప్పును 56 శాతం పెంచుతున్నదని సైంటిస్టులు అంచనావేశారు. యూకేలో పరిశోధకుల బృందం 9 సంవత్సరాలుగా 90 వేల మంది పెద్దలను ట్రాక్ చేసింది. అధ్యయనంలో పాల్గొన్న వారి నిద్ర రీతుల్ని, ఆరోగ్య పరిస్థితుల్ని వారు విశ్లేషించారు.
రాత్రిపూటే ఎక్కువ..
ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం వరకు గుండె జబ్బులు ఒత్తిడి, ఆందోళన లేదా పొగ తాగడం, మద్యం సేవించడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లే వస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇక గుండె జబ్బుల్లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో అధికంగా వస్తుంది మాత్రం హార్ట్ ఎటాక్. అది కూడా రాత్రిపూటే సంభవిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. రాత్రి 2 నుంచి తెల్లవారుజామున 6 గంటల లోపు హార్ట్ ఎటాక్‌లు ఎక్కువగా వస్తున్నాయని గుర్తించారు. అందుకే రాత్రి సమయంలో ఛాతిలో అసౌకర్యంగా అనిపించినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్న వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
వైద్యుల సూచనలు..
గుండె జబ్బులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ వ్యాయామం చేయాలని, ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలంటున్నారు. అధిక కొవ్వులు, నూనె పదార్థాలు, జంక్ ఫుడ్‌ను తినడం తగ్గించాలి. ఆకు కూరలు, తాజా కూరగాయలను, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. అతిగా తినకూడదు. ముఖ్యంగా పొగ తాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లను మానేయాలి. రాత్రిపూట ఎక్కువసేపు మేలుకోకుండా త్వరగా తినేసి నిద్రపోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే గుండె జబ్బుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Telangana Advisors System| క్యాబినెట్ పరిమాణంపై పరిమితులు.. దొడ్డిదోవన సలహాదారుల పేరిట పందేరం.. సేవ కోసమా? ప్రాపకం కోసమా?
Etela Rajendar : భూ చట్టాల అమలు లోసుగులతోనే భూ వివాదాలు జఠిలం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram