Varshini | బుల్లితెర యాంకర్స్‌లో తమ అందంతో పాటు చలాకీ మాటలతో ఆకట్టుకున్నవారిలో వర్షిణి సౌందరరాజన్ ఒకరు. అంత గ్లామర్ ఉన్నా కూడా ఎందుకో గ్లామర్ ఫీల్డ్‌లో రాణించలేకపోతుంది. చిన్న చితకా ఆఫర్స్ తో అలా నెట్టుకొస్తుంది. యాంకర్‌గా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ అందాల భామ నటిగాను క్లిక్ కావడం లేదు. సమ్మర్ కానుకగా విడుదలైన శాకుంతలం మూవీలో వర్షిణి మెరిసింది. ఈ సినిమా హిట్ అయి ఉంటే వర్షిణికి కూడా మంచి పేరు వచ్చి ఉండేది. […]
Varshini |
బుల్లితెర యాంకర్స్‌లో తమ అందంతో పాటు చలాకీ మాటలతో ఆకట్టుకున్నవారిలో వర్షిణి సౌందరరాజన్ ఒకరు. అంత గ్లామర్ ఉన్నా కూడా ఎందుకో గ్లామర్ ఫీల్డ్‌లో రాణించలేకపోతుంది. చిన్న చితకా ఆఫర్స్ తో అలా నెట్టుకొస్తుంది. యాంకర్‌గా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ అందాల భామ నటిగాను క్లిక్ కావడం లేదు. సమ్మర్ కానుకగా విడుదలైన శాకుంతలం మూవీలో వర్షిణి మెరిసింది.
ఈ సినిమా హిట్ అయి ఉంటే వర్షిణికి కూడా మంచి పేరు వచ్చి ఉండేది. కాని చిత్రం దారుణంగా ఫ్లాప్ కావడంతో వర్షిణి ఆశలన్ని గల్లంతయ్యాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వర్షిణి దుమారం రేపుతూ కుర్రాళ్లకి కునుకు లేకుండా చేస్తుంది.
ఎప్పటికప్పుడు సరికొత్త అందాలని ప్రదర్శించే ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా చాలీచాలని ఫ్రాక్ లో ఫోటో షూట్ చేసింది రచ్చకి తెరలేపింది. షార్ట్ ఫ్రాక్ లో ఆమె అందాలు దాచలేక తెగ ఇబ్బంది పడుతున్నట్టు కనిపించింది.
వర్షిణి పిక్స్ చూసిన నెటిజన్స్ పిల్లగాలి తాకిందో నీ పరువు గోవిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన ఇప్పుడు వర్షిణి క్యూట్ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక వర్షిణి కెరీర్ పరిశీలిస్తే… డాన్స్ రియాలిటీ షో ఢీ సీజన్ 12లో యాంకర్‌గా చేసిన ఈ అమమడు తర్వాతి సీజన్స్ లో అవకాశం దక్కించు కోలేకపోయింది.
శ్రీముఖి, రష్మీ వంటి వారు యాంకరింగ్‌లో దున్నేస్తుండగా, వర్షిణికి అవకాశాలు రావడం కష్టంగా మారింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన వర్షిణి చందమామ కథలు చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఇందులో ఆమె కీలక రోల్ పోషించగా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత లవర్స్ ,బెస్ట్ యాక్టర్స్ , శ్రీరామ రక్ష అనే చిన్నపాటి చిత్రాల్లో నటించారు.
హీరోయిన్ కావాలన్న ఆమె ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నప్పటికి అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇటీవల వర్షిణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నాను అని తెలిపింది. లాక్ డౌన్ కు ముందు తనకు ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం రాగా, వెబ్ సిరీస్ దర్శకుడు తనని హోటల్‌కు అడిషన్స్ కోసం రమ్మని అన్నాడట.
అప్పుడు తాను హోటల్‌కి వెళ్లగా, దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలియజేసింది. బెడ్ పై పడుకొని బట్టలు తీసెయ్యమని బెదిరించాడని, భయంతో అక్కడ నుండి పరుగెత్తుకు వచ్చానంటూ పేర్కొంది వర్షిణి .