‘వీరసింహారెడ్డి’ వేడుకకు గెస్ట్‌గా ‘వీరయ్య’.. నిజమేనా?
విధాత: సినిమా హీరోల మధ్య మంచి సాన్నిహిత్యమే ఉంటుంది. కానీ వారి అభిమానులు మాత్రం అనవసరంగా గొడవలు పడుతూ ఉంటారు. నాటి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వీరందరూ ఎంతో సన్నిహితంగానే ఉండేవారు. ఒకరి వేడుకలకు ఒకరు హాజరయ్యే వారు. కానీ వారి సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే అందులో ఒకేసారి పోటాపోటీగా అంటే ఇక అభిమానుల మధ్య గొడవలు తారా స్థాయిలో ఉండేవి. ప్రస్తుతం కూడా అదే ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ మధ్య కాస్త హీరోల […]

విధాత: సినిమా హీరోల మధ్య మంచి సాన్నిహిత్యమే ఉంటుంది. కానీ వారి అభిమానులు మాత్రం అనవసరంగా గొడవలు పడుతూ ఉంటారు. నాటి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వీరందరూ ఎంతో సన్నిహితంగానే ఉండేవారు. ఒకరి వేడుకలకు ఒకరు హాజరయ్యే వారు. కానీ వారి సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే అందులో ఒకేసారి పోటాపోటీగా అంటే ఇక అభిమానుల మధ్య గొడవలు తారా స్థాయిలో ఉండేవి. ప్రస్తుతం కూడా అదే ట్రెండ్ నడుస్తోంది.
అయితే ఈ మధ్య కాస్త హీరోల ఫ్యాన్స్ మధ్య మంచి వాతావరణమే నెలకొందని చెప్పవచ్చు. ప్రతి సంక్రాంతి లాగానే ఈ సంక్రాంతికి కూడా స్టార్ హీరోల సినిమాలతో థియేటర్స్ కళకళలాడనున్నాయి. నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు జనవరి 12, 13 వ తేదీల్లో అంటే పక్కపక్క రోజున విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలను ఒకే సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండడం విశేషం.
తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒకే ప్రొడక్షన్ హౌస్ నుండి రెండు పెద్ద సినిమాలు ఒక్కరోజు గ్యాప్‌లో విడుదలవ్వడం ఇదివరకు ఎన్నడూ జరగలేదు.. ఇదే తొలిసారి. అయితే చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీస్ వార్ ఇప్పటిది కాదు. ముఖ్యంగా సంక్రాంతికి వీరు ఇప్పటివరకు 9సార్లు పోటీపడ్డారు. నాలుగు సార్లు చిరంజీవి విజేతగా నిలువగా, మూడుసార్లు బాలయ్య ఆధిపత్యం కనిపించింది. రెండుసార్లు మాత్రం ఇద్దరి చిత్రాలు విజయం సాధించాయి.
అయితే ఇప్పుడు విడుదల కాబోతోన్న రెండు సినిమాల విషయంలో కూడా ఒకరి అభిమానులు వేరొకరి సినిమాలపై నెగటివ్ ప్రచారం చేసుకోకుండా.. ఇరు హీరోల అభిమానులు కూడా రెండు చిత్రాలను ఆదరించేలా మైత్రి మూవీ మేకర్స్ ఒక ప్లాన్ వేసింది. అదేమిటంటే త్వరలో జరగబోయే వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు.
ఇటీవలే మెగాస్టార్‌ను మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయమై సంప్రదించారట. మరోవైపు చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్‌కి కూడా బాలయ్యను ముఖ్యఅతిథిగా పిలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారట. త్వరలో వీరిద్దరి కాంబినేషన్లో ఇంటర్వ్యూస్ కూడా చిత్రీకరించబోతున్నారట. ఈ క్రేజ్ ఐడియా అదిరిపోయింది అంటున్నారు ఫ్యాన్స్.
ఇదే నిజమైతే ఇక ఫ్యాన్స్‌కు కనుల పండువే అని చెప్పవచ్చు. గతంలో బాలయ్య కూతురు వివాహ వేడుకల్లో, చిరంజీవి కూతుర్ల వివాహ వేడుకల్లో బాలయ్య.. చిందులు కూడా వేశారు. కాబట్టి ఇలా చేయడం ద్వారా మేము మేము బాగానే ఉంటాము. అభిమానులు కూడా ఇలా కలిసి ఉండాలి. ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయి అనే సందేశం ఇవ్వన్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని తెలుస్తుంది.