Viagra | వ‌యాగ్రాపై నిషేధం.. ఉడుం నూనె కోసం యువ‌త క్యూ..!

Viagra | శృంగార కార్యంతో ఆలుమ‌గ‌లిద్ద‌రూ ఎంతో అనుభూతిని పొందుతారు. మాన‌సికంగా ప్ర‌శాంత‌త‌ను పొందుతారు. మ‌రి అలాంటి శృంగారాన్ని త‌నివితీరా అనుభ‌వించేందుకు చాలా మంది వ‌యాగ్రాను వినియోగిస్తుంటారు. ఇది ఒక‌ర‌కంగా శ‌రీరానికి ప్ర‌మాద‌క‌ర‌మే అయిన‌ప్ప‌టికీ.. డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు ఆయా మోతాదుల్లో వినియోగిస్తుంటారు. అయితే ఈ వ‌యాగ్రాపై పాకిస్తాన్ ప్ర‌భుత్వం నిషేధం విధించిన విష‌యం విదిత‌మే. వ‌యాగ్రాను బ్యాన్ చేయ‌డంతో.. పాక్ యువ‌త ప్ర‌త్యామ్నాయ మార్గాల‌పై దృష్టి సారించారు. అయితే ఉడుం నుంచి తీసిన కొవ్వును తేలు […]

  • Publish Date - May 1, 2023 / 01:44 PM IST

Viagra |

శృంగార కార్యంతో ఆలుమ‌గ‌లిద్ద‌రూ ఎంతో అనుభూతిని పొందుతారు. మాన‌సికంగా ప్ర‌శాంత‌త‌ను పొందుతారు. మ‌రి అలాంటి శృంగారాన్ని త‌నివితీరా అనుభ‌వించేందుకు చాలా మంది వ‌యాగ్రాను వినియోగిస్తుంటారు. ఇది ఒక‌ర‌కంగా శ‌రీరానికి ప్ర‌మాద‌క‌ర‌మే అయిన‌ప్ప‌టికీ.. డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు ఆయా మోతాదుల్లో వినియోగిస్తుంటారు. అయితే ఈ వ‌యాగ్రాపై పాకిస్తాన్ ప్ర‌భుత్వం నిషేధం విధించిన విష‌యం విదిత‌మే.

వ‌యాగ్రాను బ్యాన్ చేయ‌డంతో.. పాక్ యువ‌త ప్ర‌త్యామ్నాయ మార్గాల‌పై దృష్టి సారించారు. అయితే ఉడుం నుంచి తీసిన కొవ్వును తేలు నూనెలో మేరినేట్ చేసి ఎరుపు రంగు మ‌సాలాల్లో ఉప‌యోగిస్తారు. లేదా దీంతో సాందా తైలాన్ని త‌యారు చేస్తున్నారు.

ఇలా ఉడుం నూనెతో లైంగిక సామ‌ర్థ్యం పెంచుకో వ‌చ్చ‌ని పాకిస్తాన్ యువ‌త బ‌లంగా న‌మ్ముతున్నారు. దీంతో ఉడుం నూనె కోసం అక్కడి యువ‌త ఎగ‌బడుతున్నారు. వేల రూపాయాలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు ఉడుం నూనెను. రావ‌ల్పిండిలోని రాజా బ‌జార్‌లో ఉడుం నూనె కోసం యువ‌త క్యూ క‌డుతున్నారు.

ఉడుం నూనెకు భారీగా డిమాండ్ పెర‌గ‌డంతో.. ఉడుముల వేట‌పైనే ఆధార‌ప‌డి బ‌తుకుతున్న పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లోని చాలా మందికి మంచి ఆదాయం స‌మ‌కూరుతోంది. ఉడుముల‌ను చంప‌డం కాస్త ఇబ్బంది, బాధ అనిపించిన‌ప్ప‌టికీ, జీవనోపాధి కోసం వాటిని చంప‌క త‌ప్ప‌డం లేద‌ని చెబుతున్నారు.

పాకిస్తాన్‌లో ఎంత ఎక్కువ మందిని కంటే అంతగా స‌మాజంలో గౌర‌వం ద‌క్కుతుంది. ఈ క్ర‌మంలో పిల్ల‌లు లేక‌పోతే ప‌రువు పోతుంద‌ని భావించిన పాకిస్తానీయులు.. లైంగిక సామ‌ర్థ్యాన్ని పెంచుకునేందుకు వ‌యాగ్రా వినియోగిస్తుంటారు.

కానీ వ‌యాగ్రాను నిషేధించ‌డంతో.. ఉడుం నూనె బాట ప‌ట్టారు. దీంతో ఆ నూనెకు భారీగా డిమాండ్ పెరిగింది. అయితే ఉడుం నూనె వ‌ల్ల లైంగిక సామ‌ర్థ్యం పెరుగుతుంద‌ని ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేన‌ప్ప‌టికీ.. వేట‌గాళ్లు మాత్రం నిజంగానే ఈ నూనెలో లైంగిక సామ‌ర్థ్యాన్ని పెంచే గుణాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు.

Latest News