Viral Video | విమానాన్ని ఢీకొన్న భారీ ప‌క్షి.. పైల‌ట్ ముందు కాళ్లు వేల్లాడుతున్నా సేఫ్ ల్యాండింగ్‌

Viral Video | ఓ భారీ ప‌క్షి ఎగురుతున్న విమానాన్ని ఢీకొన‌గా.. అది విమానం విండ్ షీల్డ్‌లో ఇరుక్కుపోయినట్టు ఉన్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఆ భారీ ప‌క్షి కాళ్లు స‌రిగ్గా పైల‌ట్ ముందు వేళ్లాడుతూ.. ముందు ఏముందో క‌నిపించ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రోవైపు ప‌క్షి ఢీకొన‌డం వ‌ల్ల ప‌గిలిన అద్దం లోంచి వ‌స్తున్న గాలి విమానాన్ని ఊపేస్తోంది. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లోనూ స‌ద‌రు పైల‌ట్ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి విమానాన్ని సుర‌క్షితంగా ల్యాండ్ చేయ‌డంతో […]

  • By: krs    latest    Jun 17, 2023 5:17 AM IST
Viral Video | విమానాన్ని ఢీకొన్న భారీ ప‌క్షి.. పైల‌ట్ ముందు కాళ్లు వేల్లాడుతున్నా సేఫ్ ల్యాండింగ్‌

Viral Video |

ఓ భారీ ప‌క్షి ఎగురుతున్న విమానాన్ని ఢీకొన‌గా.. అది విమానం విండ్ షీల్డ్‌లో ఇరుక్కుపోయినట్టు ఉన్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఆ భారీ ప‌క్షి కాళ్లు స‌రిగ్గా పైల‌ట్ ముందు వేళ్లాడుతూ.. ముందు ఏముందో క‌నిపించ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

మ‌రోవైపు ప‌క్షి ఢీకొన‌డం వ‌ల్ల ప‌గిలిన అద్దం లోంచి వ‌స్తున్న గాలి విమానాన్ని ఊపేస్తోంది. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లోనూ స‌ద‌రు పైల‌ట్ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి విమానాన్ని సుర‌క్షితంగా ల్యాండ్ చేయ‌డంతో నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

పైల‌ట్ పేరు ఏరియ‌ల్ వాలిటైల్ కాగా.. ఈ ఘ‌ట‌న ఈక్వెడార్‌లో జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. వీడియోలో పైల‌ట్ మొహం ర‌క్త‌సిక్త‌మైన‌ట్లు క‌నిపిస్తున్నా.. అది ప‌క్షి ర‌క్త‌మో.. ఆయ‌న‌కు త‌గిలిన గాయాలో తెలియ‌రాలేదు. ఇలాంటింది జ‌రిగిన‌పుడు నాకు తెలిసిన పైల‌ట్ ఒక‌రు క‌న్ను కోల్పోయార‌ని విన్నాను అని ఒక యూజ‌ర్ వ్యాఖ్యానించ‌గా.. ఈ పైల‌ట్ ఒక లెజెండ్ అని మ‌రొక‌రు స్పందించారు.

అయితే ఘ‌ట‌న‌లో ప్ర‌మాదానికి గురైన ప‌క్షి ఏంట‌నేది తెలియ‌లేదు. వీడియోను బాగా గ‌మ‌నించిన కొంద‌రు మాత్రం అది.. ఆండియ‌న్ కాండొర్ జాతి ప‌క్షి అని చెబుతున్నారు. దీని రెక్క‌ల విస్తృతి సుమారు 9 అడుగులు ఉంటుంది.