Bird | ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల పక్షులున్నాయి. ఒక్కో పక్షికి ఒక్కో రకమైన ప్రత్యేకత ఉన్నది. కొన్ని పక్షులు కిలకిలరావాలతో ఆకర్షిస్తుంటాయి. మరికొన్ని పక్షులు మనుషుల వాయిస్‌ను సైతం అనుకరిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అయితో, పక్షి భిన్నంగా వాయిస్‌ను అనుకరిస్తూ జనాలతో పాటు పోలీసులను సైతం ఇబ్బందులుపెడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Bird | ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల పక్షులున్నాయి. ఒక్కో పక్షికి ఒక్కో రకమైన ప్రత్యేకత ఉన్నది. కొన్ని పక్షులు కిలకిలరావాలతో ఆకర్షిస్తుంటాయి. మరికొన్ని పక్షులు మనుషుల వాయిస్‌ను సైతం అనుకరిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అయితో, పక్షి భిన్నంగా వాయిస్‌ను అనుకరిస్తూ జనాలతో పాటు పోలీసులను సైతం ఇబ్బందులుపెడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా కొన్ని పక్షులు మనుషులతో పాటు ఇతర వాయిస్‌లను సైతం అనుకరించే విషయం తెలిసిందే. లండన్‌లోని థేమ్స్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పక్కన ఘటన చోటు చేసుకున్నది. విధుల్లో బిజీగా ఉన్న పోలీసులు, వాహనాల్లో వెళ్తున్న జనాలను పక్షి పోలీస్ సైరన్‌ను వినిపిస్తూ కంగారు పెట్టిస్తున్నది.
పోలీస్ వాహనం సైరన్ వస్తున్న రోడ్డుపై మాత్రం వాహనం కనిపించలేదు. ఎక్కడి నుంచి సైరన్ వస్తుందని జాగ్రత్తగా వెతకగా.. ఓ చెట్టు కొమ్మల నుంచి వస్తుందని.. ఇదంతా ఓ తుంటరి పక్షి నిర్వాకంగా వాహనదారులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. థేమ్స్ వ్యాలీలోని పోలీస్ స్టేషన్ పక్కనే ఓ రహదారిపై ఉంది. రహదారి పక్కనే చెట్టు ఉంది. దానిపై పక్షి ఉంటున్నది. కొంతకాలంగా అక్కడే ఉంటూ వస్తుండగా పోలీస్ వాహనాల సైరన్ శబ్దాలను వింటూ వస్తోంది. తాజాగా సైరెన్‌ను అనుకరించడం మొదలుపెట్టింది. పక్షి పోలీస్ సైరన్ చేస్తుండడంతో అటు వాహనదారులు, ఇటు పోలీసులు సైతం వాహనాలను ఆపి ఏం జరిగిందోనని తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం పక్షికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.
From our workshops that test out the two tone tune to officers deploying to jobs, this little fella has been sat patiently observing the noise to recreate it! 🐦⬛ pic.twitter.com/p49FhZ3HMj
— Thames Valley Police (@ThamesVP) April 10, 2024