‘Visakha’ Steel: విశాఖ స్టీల్.. బిడ్ గడువు పెంపు
బిడ్ దాఖలు చేసిన లక్ష్మీనారాయణ సింగరేణి కాలరీస్ కూడా దాఖలు? విధాత: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టు (ఆసక్తి వ్యక్తీకరణ) గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించారు. సింగరేణి కాలరీస్ కంపెనీతో పాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) మాజీ జెడి వి.వి.లక్ష్మీనారాయణ కూడా బిడ్ దాఖలు చేశారు. శనివారం సాయంత్రం వరకు సుమారు 22 సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ చేశాయి. మరిన్ని సంస్థలు పాల్గొనున్నాయనే ప్రాథమిక సమాచారం […]

- బిడ్ దాఖలు చేసిన లక్ష్మీనారాయణ
- సింగరేణి కాలరీస్ కూడా దాఖలు?
విధాత: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టు (ఆసక్తి వ్యక్తీకరణ) గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించారు. సింగరేణి కాలరీస్ కంపెనీతో పాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) మాజీ జెడి వి.వి.లక్ష్మీనారాయణ కూడా బిడ్ దాఖలు చేశారు. శనివారం సాయంత్రం వరకు సుమారు 22 సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ చేశాయి.
మరిన్ని సంస్థలు పాల్గొనున్నాయనే ప్రాథమిక సమాచారం అందడంతో బిడ్ దాఖలుకు మరో ఐదు రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కూడా బిడ్ వేసినట్లు తెలిసింది. పాల్గొన్నది లేనిది అధికారిక ప్రకటన విడుదల అయితే కాని స్పష్టంగా తెలియదు. బిడ్ దాఖలు చేసే ముందు వి.వి.లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను నడిపేందుకు ప్రతినెలా రూ.850 కోట్లు పెట్టుబడి అవసరం ఉంటుందన్నారు. ఈ నిధులను క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరిస్తామని చెప్పారు. ప్రజల తరఫున నేనే బిడ్ వేస్తున్నానని, ప్రైవేటీకరణే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానం అయితే, ప్రజలెలా తిప్పికొడతారో చూపిస్తానని లక్ష్మీనారాయణ అన్నారు.