Warangal | కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రం: మంత్రి హరీష్‌రావు
Warangal కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి కార్మిక యుద్ధభేరిలో రాష్ట్ర మంత్రి హరీష్ రావు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా హనుమకొండలో బుధవారం నిర్వహించిన కార్మిక యుద్దభేరి బహిరంగ సభలో […]

Warangal
- కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
- కార్మిక యుద్ధభేరిలో రాష్ట్ర మంత్రి హరీష్ రావు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా హనుమకొండలో బుధవారం నిర్వహించిన కార్మిక యుద్దభేరి బహిరంగ సభలో మంత్రులు హరీష్ రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా కార్మికులకు అన్నిరకాల అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని హరీష్ రావు అన్నారు. కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గృహ వసతి కల్పించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని వివరించారు.
కార్మికులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. చెడుగలవాటకు దూరంగా కుటుంబాలను పోషించుకునేందుకు నిబద్ధతతో ఉండాలని కోరారు.
ఈ సందర్భంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన కార్మికుల పిల్లలకు అవార్డులు ప్రధానం చేశారు. కార్మికుల సంక్షేమం వల్ల సాధకబాధకాలు తెలుసుకునేందుకు నెల రోజులపాటు వినయభాస్కర్ చేసిన కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ లు కడియం శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి,నగర మేయర్ గుండు సుధారాణి, కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.