WARANGAL | భూకబ్జారాయుడిపై పీడీ యాక్ట్.. సెంట్రల్ జైలులో ఉత్తర్వుల అందజేత
WARANGAL | వరంగల్ పోలీసుల కఠిన చర్యలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భూ భూకబ్జారాయుళ్ళ ఆగడాల కట్టడికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ చర్యలు ప్రారంభించారు. సామాన్యుల ఇండ్ల స్థలాలతో పాటు ఉద్యోగ రీత్యా విదేశాల్లో వున్న వ్యక్తులకు చెందిన స్థలాలపై కన్నేసి, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, వారి స్థలాలను కబ్జాలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపారు. ఏకంగా పీడీ యాక్ట్ ప్రయోగించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన […]

WARANGAL |
వరంగల్ పోలీసుల కఠిన చర్యలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భూ భూకబ్జారాయుళ్ళ ఆగడాల కట్టడికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ చర్యలు ప్రారంభించారు. సామాన్యుల ఇండ్ల స్థలాలతో పాటు ఉద్యోగ రీత్యా విదేశాల్లో వున్న వ్యక్తులకు చెందిన స్థలాలపై కన్నేసి, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, వారి స్థలాలను కబ్జాలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపారు. ఏకంగా పీడీ యాక్ట్ ప్రయోగించారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి భూ కబ్జారాయుళ్ల పట్ల ప్రత్యేక దృష్టి సారించిన ఆయన.. తాజాగా మరో అడుగు ముందుకేసి భూ కబ్జారాయుళ్లపై పీడీ యాక్ట్ నమోదు కు శనివారం శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగానే నకిలీ జీపీఏలతో భూ కబ్జాలకు పాల్పడమే కాకుండా తప్పుడు పత్రాలతో బ్యాంక్ రుణాలను పొందిన భూ కబ్జారాయుడిపై పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. కేయూసీ ఇన్స్ స్పెక్టర్ అబ్బయ్య పీడీ యాక్ట్ ఉత్తర్వులను నిందితుడికి చర్లపల్లి కారాగారంలో జైలర్ సమక్షంలో అందజేశారు.
హనుమకొండ గోపాల్ పూర్ ప్రాంతానికి చెందిన వలబోజు కేదారేశ్వర్ (38), సివిల్ ఇంజనీరింగ్ చేసి తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో అవసరమైన వారికి బ్యాంక్ రుణాలకు కావాల్సిన పత్రాలను తయారు చేసి అందజేసేవారు. ఇదే సమయంలో విదేశాల్లో వుండే వ్యక్తులకు సంబంధించిన స్థలాలను జీపీఏ పత్రాలను తయారు చేసేవాడు.
ఈ అనుభవంతో నిందితుడు కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖాళీ జాగాలపై నజర్ వేసి వాటిపై నకిలీ జీపీఏ లను సృష్టించి స్థలాలను కబ్జా చేసి అసలు స్థల యజమానులను ఇబ్బందులకు గురిచేస్తూ, రాజీ అయితే స్థలం అసలు యాజమానుల నుండి లక్షల్లో డబ్బులు గుంజేవాడు. అంతే కాకుండా నిందితుడు తయారు చేసిన నకిలీ జీపీఏ పత్రాలతో పాటు బ్యాంక్ రుణాలకు అవసరమైన తప్పుడు పత్రాలను బ్యాంక్ కు అందజేసి పెద్ద మొత్తం బ్యాంక్ రుణాలు పొందాడు.
ఈ కబ్జారాయుడి పై ఫిర్యాదులు రావడంతో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రంగంలోకి టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, కేయూసీ పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు పాల్పడుతున్న భూ కబ్జాల తీరు వెలుగులోకి రావడంతో పాటు కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం నాలుగు కేసులు నమోదు కావడంతో నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇకపై ఎవరైనా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నా, వారిని మోసం చేసినా సహించేది లేదని.. ఇలాంటి చర్యలకు పాల్పడినవారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని కబ్జారాయుళ్లను పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.