Warangal | కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పై ప్రధాని మోడీ ప్రకటన చేయాలి: వినయ్‌భాస్కర్
Warangal పోరాడడం వరంగల్ బిడ్డలకు కొత్త కాదు తెలంగాణపై బిజెపికి చిత్తశుద్ధి లేదు బిజెపి ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తేవాలి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, హనుమకొండ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఈనెల 8వ తేదీన మోడీ వరంగల్ […]

Warangal
- పోరాడడం వరంగల్ బిడ్డలకు కొత్త కాదు
- తెలంగాణపై బిజెపికి చిత్తశుద్ధి లేదు
- బిజెపి ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తేవాలి
- రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, హనుమకొండ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.
ఈనెల 8వ తేదీన మోడీ వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్నందున నాలుగు దశాబ్దాలుగా ఉన్న ప్రజల డిమాండ్ ను పరిష్కరించకుంటే బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఈ ప్రాంత బిడ్డలు పోరాటం చేస్తారని వినయ్ ప్రకటించారు. హనుమకొండలో ఆదివారం మేయర్ గుండు సుధారాణితో కలిసి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ బిజెపి ప్రజా ప్రతినిధులదే బాధ్యత
తెలంగాణ ప్రాంత ప్రజలపై విశ్వాసం, అభిమానం ఏమాత్రం ఉన్నా బిజెపి ప్రజా ప్రతినిధులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు మోడీ చేత కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రకటన చేయించాలని వినయ్ డిమాండ్ చేశారు. గతంలో కోచ్ ఫ్యాక్టరీ పై కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజలకు ద్రోహం చేసిందని విమర్శించారు. ఇటీవల బీజేపీ కూడా అదే తీరుగా వ్యవహరించి కాజీపేటకు మొండి చేయి చూపెట్టి గుజరాత్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని విమర్శించారు.
ఈ ప్రాంత యువతకు ఉపాధి లభిస్తుందని దూర దృష్టితో కోచ్ ఫ్యాక్టరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాలను ఇస్తే మొదట పి ఓ హెచ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడు వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని రకరకాల వాగ్దానాలు చేస్తూ కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ ను అటుకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోరాటం ఈ ప్రాంత బిడ్డలకు కొత్త కాదని కోచ్ ఫ్యాక్టరీ సాధించేంతవరకు ఉద్యమిస్తామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మూడు విభజన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పట్ల నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిజెపి ప్రభుత్వం పట్టించుకోకుంటే భవిష్యత్తులో కేసీఆర్ సహకారంతో ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ డిమాండ్లు అమలు చేసుకుంటామని వినయ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.