Weather Update | తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ..!

Weather Update | తెలంగాణ రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. శనివారం సైతం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ. రాబోయే మూడు గంటల్లో ఉరుములు, […]

Weather Update | తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ..!

Weather Update | తెలంగాణ రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. శనివారం సైతం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ. రాబోయే మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఇదిలా ఉండగా.. శుక్రవారం వేకువ జాము నుంచి పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్నది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, నాంపల్లి, చందానగర్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, జగద్గిరిగుట్ట, జేఎన్‌టీయూ, ప్రగతినగర్‌, మూసాపేట్‌, కుత్బుల్లాపూర్‌, సూరారం, జీడిమెట్ల, చింతల్‌, బాలానగర్‌, కొంపల్లి వర్షం కురుస్తున్నది. సుచిత్ర, బోయిన్‌పల్లి, సికింద్రాబాద్‌, మాదాపూర్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండగా వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.

అయితే, మాడుపగిలేలా ఎండలు దంచికొడుతున్న సమయంలో ఒక్కసారిగా శుక్రవారం ఉదయం వాతావరణం చల్లబడడంతో జనమంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రికి పలుచోట్ల కురిసిన వర్షంతో ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది. గురువారం సాయంత్రం పలుచోట్ల వర్షం కురవగా.. నగరాన్ని మేఘాలు కమ్మేశాయి. శుక్రవారం వేకువ జాము నుంచి వర్షం కురవడంతో నగరం మొత్తం చల్లబడింది.