Perni Nani | ఓపెన్ అయిన పేర్ని నాని.. ఆయన ఉద్దేశం అదేనా..?
Perni Nani విధాత: ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో నాలుకను అటు తిప్పి ఇటు తిప్పి ఎటైనా తిప్పి మాయ చేయడం. తన డైలాగ్స్, పంచ్ లతో అవతలి వారిని వెక్కిరించడం.. తన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని డిఫెండ్ చేయడంలో బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని)కి ఒక బ్రాండ్ నేమ్ ఉంది. నిన్న బందరు పోర్ట్ పనులకు శంకుస్థాపన చేయడానికి జగన్ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నాని మాట్లాడుతూ చేసిన రెండు మూడు […]
Perni Nani
విధాత: ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో నాలుకను అటు తిప్పి ఇటు తిప్పి ఎటైనా తిప్పి మాయ చేయడం. తన డైలాగ్స్, పంచ్ లతో అవతలి వారిని వెక్కిరించడం.. తన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని డిఫెండ్ చేయడంలో బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని)కి ఒక బ్రాండ్ నేమ్ ఉంది.
నిన్న బందరు పోర్ట్ పనులకు శంకుస్థాపన చేయడానికి జగన్ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నాని మాట్లాడుతూ చేసిన రెండు మూడు కామెంట్స్ ఆయన అభిమానులు, కార్యకర్తల్లో ఆలోచనలు రేకెత్తించాయి .బహుశా ఇదే నా చివరి సమావేశం కావచ్చు.. జగన్ గారితో మళ్లీ నేను ఇలా పాల్గొనలేనేమో అన్నారు. అంటే రానున్న ఎన్నికల్లో అయన పోటీ చేయరా.? ఎన్నికలకు దూరంగా ఉంటారా అనే సందేహాలు వస్తున్నాయి.
జగన్తో కలిసి ఇదే నా చివరి మీటింగ్ : Perni Nani – TV9
#PerniNani #CMYSJagan #YCP pic.twitter.com/hM4gaibwT9
— TV9 Telugu (@TV9Telugu) May 22, 2023
వాస్తవానికి పేర్ని నాని తన కొడుకు కృష్ణమూర్తి(కిట్టు) ని ఈసారి బందరులో పోటీ చేయించి రాజకీయ ప్రవేశం చేయిద్దామని అనుకుంటున్నారు. అందుకే తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని కొడుకుని నడిపిస్తానని భావిస్తున్నారు. దీనికి జగన్ ఏమన్నారో తెలియదు.. కానీ నాని మాత్రం ఇలా ఓపెన్ అయ్యారు.
వాస్తవానికి ఈసారి వారసులకు టికెట్స్ లేవని.. తండ్రులే పోటీలో ఉండాలని జగన్ గతంలోనే చెప్పారని అంటున్నారు. కానీ కొందరు మాత్రం కొడుకులకు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కారుమూరి నాగేశ్వర రావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్ వంటి పలువురు నాయకులూ ఇప్పటికే తమ కొడుకులను జనంలో తిప్పుతూ నాయకుడిగా పరిచయం చేస్తున్నారు.
అయితే అలాంటి ప్రయోగాలు ఇప్పుడు వద్దని .. రానున్నది చాలా కీలక సమయం అని .. ఇప్పుడు మీరు లేకపోతె అవుతుందని జగన్ చెబుతూ వస్తున్నారట. మరి కొందరికి హామీ ఇచ్చారేమో, ఆ లిస్ట్ లో పేర్ని నాని ఉన్నారేమో తెలియదు కానీ ఆయన మాటలు చూస్తుంటే కొడుకుకు రాజకీయ మార్గం చూపించి తాను బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేస్తారని అంటున్నారు.
జగన్ సీట్ ఇస్తే మా అబ్బాయి పేర్ని కిట్టు ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అన్నాడు.. – పేర్ని నాని
FULL VIDEO >>>https://t.co/OhKpWoF1lj#perninani #pernikittu #ysrcp #cmysjagan #MachilipatnamPort #AndhraPradesh #NTVTelugu pic.twitter.com/dEll3opudb
— NTV Telugu (@NtvTeluguLive) May 22, 2023
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram