WhatsApp Features |
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ ఆకట్టుకుంటున్నది. తాజాగా మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే వరకు హెచ్‌డీ ఫొటోలను పంపే ఫీచర్‌ను పరిచయం చేసిన వాట్సాప్.. హెచ్‌డీ వీడియోలను సైతం పంపే వీలును కల్పిస్తున్నది.
ప్రస్తుతం పలువురు యూజర్లకు అందుబాటులోకి తీసుకురాగా.. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తేబోతున్నది. ప్రస్తుతం వాట్సాప్ లో ప్రస్తుతం ఏ వీడియో పంపినా.. ఆటోమేటిక్‌గా 480 పిక్సెల్ కంప్రెస్ అవుతుంది. ఎంత క్వాలిటీ ఉన్నా పంపే సమయంలో క్వాలిటీ తగ్గుతూ వస్తుంది.
తాజాగా అందుబాటులోకి వచ్చిన ఫీచర్‌తో 720 పిక్సెల్ వరకు వీడియోను పంపుకునేందుకు అవకాశం ఉంటుంది. గతంతో పోలిస్తే మరికాస్త క్వాలిటీ వీడియోను పంచుకునేందుకు అవకాశం కలుగనున్నది. త్వరలోనే 1080 పిక్సెల్, 4కే వీడియోలను సైతం పంపేలా ఫీచర్‌ను యూజర్ల కోసం తీసుకువచ్చేందుకు పరిశోధనలను చేస్తున్నది వాట్సాప్.
హెచ్‌డీ వీడియోలను ఎలా పంపాలంటే..
హెచ్‌డీ ఫొటోలను సెండ్ చేసుకునేందుకు ఫీచర్ మాదిరిగానే హైక్వాలిటీ వీడియోలను పంపుకునేందుకు హెచ్‌డీ వీడియో ఫీచర్ అందుబాటులో ఉంది. ఎవరైనా హెచ్‌డీ వీడియోలను పంపాలనుకుంటే మొదట వాట్సాప్ అప్‌డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్‌ను ఓపెన్ చేసి.. కాంటాక్ట్ లిస్టులోకి వెళ్లాలి.
ఎవరికి వీడియో పంపాలో వారికి వీడియో అటాచ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి వీడియోను ఎంపిక చేసుకోవాలి. వీడియో సెలెక్ట్ చేసుకోగానే హెచ్‌డీ అనే టోగుల్ కనిపిస్తుంది.. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. 70 పిక్సెల్ హెచ్‌డీ క్వాలిటీ వీడియోను పంపుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఇదిలా ఉండగా.. ఇటీవల యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను వాట్సాప్ పరిచియం చేసింది. మెసేజ్ ఎడిట్, వీడియో మెసేజ్ ఫీచర్‌ను సైతం తీసుకువచ్చింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఫీచర్లను పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నది.