WhatsApp | మరో సూపర్‌ ఫీచర్‌ను పరిచయం చేయబోతున్న వాట్సాప్‌..! ఇతర యాప్‌లకు సందేశాలను పంపే ఛాన్స్‌..!

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వినియోగించే మెసేజింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ వాట్సాప్‌. ఈ క్రమంలో కంపెనీ సైతం ఎప్పటికప్పుడు యూజర్ల కోసం మెరుగైన ఫీచర్స్‌ను పరిచయం చేస్తూ వస్తున్నది

WhatsApp | మరో సూపర్‌ ఫీచర్‌ను పరిచయం చేయబోతున్న వాట్సాప్‌..! ఇతర యాప్‌లకు సందేశాలను పంపే ఛాన్స్‌..!

WhatsApp | ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వినియోగించే మెసేజింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ వాట్సాప్‌. ఈ క్రమంలో కంపెనీ సైతం ఎప్పటికప్పుడు యూజర్ల కోసం మెరుగైన ఫీచర్స్‌ను పరిచయం చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఫీచర్‌ను పరిచయం చేయబోతున్నది. ఈ ఫీచర్‌ సహాయంతో వాట్సాప్‌ సహాయంతో ఇతర యాప్‌లకు సైతం మెసెజెస్‌ పంపుకునే అవకాశం లభించనున్నది. వాట్సాప్‌తో పాటు టెలిగ్రామ్‌ సహా ఇతర యాప్‌లనుకు సులభంగా తమ మెస్సేజ్‌లను పంపే వీలు కల్పించబోతున్నది. ప్రస్తుతం మెటా యాజమాన్యంలోని కంపెనీ ఈ ఫీచర్‌పై పని చేస్తుందని వాబీటాఇన్ఫో పేర్కొంది.


కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి చాట్ ఇంటర్‌పెరాబిలిటీపై పనిచేస్తోందని తెలిపింది. ఈ ఫీచర్‌ ఇరత యాప్‌లకు సైతం సపోర్ట్‌ ఇస్తుందని ఈయూ రెగ్యులేటరి ఏజెన్సీ డిజిటల్‌ మార్కెట్‌ యాక్ట్‌ (DMA)కి వాట్సాప్ వెల్లడించింది. ఆండ్రాయిడ్ బీటా(beta) వెర్షన్ 2.24.5.18లో ఉన్న చాట్ ఇంటర్‌ఆపరబిలిటీ ఫీచర్‌పై పని చేస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్‌లో విడుదల చేసిన తాజా 2.24.5.20 బీటా వెర్షన్ వాట్సాప్ డెడికేటెడ్ చాట్ ఇన్ఫో స్క్రీన్ అనే ఆప్షన్‌ అందుబాటులో ఉంటుందని.. ఇది థర్డ్ పార్టీ చాట్‌ల కోసం ఉంటుందని పేర్కొంది.