WhatsApp | వాట్సాప్‌లో ఇన్‌ యాప్‌ డయలర్‌ ఫీచర్‌..! నంబర్‌ సేవ్‌ చేయకున్నా కాల్స్‌ చేయొచ్చు..!

WhatsApp | ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp)కి ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల సంఖ్యలో యూజర్లు ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు వాట్సాప్‌ సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఫీచర్‌ను పరిచయం చేయబోతున్నది. అదే ‘ఇన్‌ యాప్‌ డయలర్‌’ (In dialer feature)ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది.

WhatsApp | వాట్సాప్‌లో ఇన్‌ యాప్‌ డయలర్‌ ఫీచర్‌..! నంబర్‌ సేవ్‌ చేయకున్నా కాల్స్‌ చేయొచ్చు..!

WhatsApp | ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp)కి ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల సంఖ్యలో యూజర్లు ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు వాట్సాప్‌ సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఫీచర్‌ను పరిచయం చేయబోతున్నది. అదే ‘ఇన్‌ యాప్‌ డయలర్‌’ (In dialer feature)ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. దీని సహాయంతో యూజర్లు నంబర్లు సేవ చేయకుండానే కాల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

కాంటాక్ట్‌ లిస్ట్‌లో సేవ్‌ చేసినా.. లేకపోయినా నేరుగా వాట్సాప్‌ నుంచి కాకుండా సాధారంగా కాల్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నది. ప్రత్యేకించి ఎవరైనా కొత్త వ్యక్తిని సంప్రదించాల్సి వచ్చిన సమయంలో నంబర్‌ సేవ చేసుకోకుండానే కాల్‌ చేసేందుకు ఈ ఫీచర్‌ ఉపయోగపడనున్నది. కంపెనీలకు వినియోగదారులు.. వినియోగదారుల నుంచి సేల్స్‌ రిప్రజెంటేటివ్‌ తదితర వ్యక్తుల నుంచి కొత్త నంబర్లకు కాల్‌ చేయాల్సిన సందర్భంలో ఈ ఫీచర్‌ ఉపయోగకరంగా ఉంటుంది.

వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ ఉపయోగించడం చాలా సులభం. యాప్‌లోని డయలర్ ఇంటర్‌ఫేస్ వినియోగదారులు నంబర్‌ను నమోదు చేయడం ద్వారా సులభంగా కాల్‌ చేసుకోవచ్చు. ఇంటర్‌ఫేస్ సరళంగా మార్చనున్నది. తద్వారా వినియోగదారులందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. వాట్సాప్‌ భవిష్యత్తు ఫీచర్లను ట్రాక్ చేసే WABetaInfo ప్రకారం.. ఇన్-యాప్ డయలర్ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నది. ఆండ్రాయిడ్ 2.24.13.17 అప్‌డేటెడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉందని వాట్సప్‌బీటాఇన్ఫో (WABetaInfo) పేర్కొంది.

వాట్సప్ యూజర్ యాప్ నుంచి ఎగ్జిట్ కాకుండానే కాల్స్ చేసుకోవచ్చు, ఇందుకోసం యూజర్లు కాంటాక్ట్ బుక్‌ను యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని తెలిపింది. యాప్‌లో కుడివైపున దిగువన కొత్త ఫ్లోటింగ్ యాక్షన్ బటన్‌ కనిపిస్తుందని, దీనికి యాక్సెస్ ఇస్తే కాల్స్ సులభంగా చేసుకోవచ్చునని వివరించింది. కాలింగ్‌తో పాటు మెసేజింగ్ షార్ట్‌కట్ డయలర్ స్క్రీన్‌ కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపింది. పరిశీలన కోసం ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమందికే అందుబాటులో ఉందని, రాబోయే రోజుల్లో మరింత మందికి అందుబాటులోకి వస్తుందని చెప్పింది.