Horoscope | మంగ‌ళ‌వారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి స‌న్నిహితుల‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Feb 10, 2026 6:11 AM IST
Horoscope | మంగ‌ళ‌వారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి స‌న్నిహితుల‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కుటుంబ పెద్దలతో గౌరవంగా మెలగాలి. సన్నిహితులతో కోపావేశాలు అదుపులో ఉంచుకుని మాట్లాడాలి. శత్రువులతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆత్మీయుల సహాయ సహకారాలు ఉంటాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఆర్ధిక క్రమశిక్షణతో ఖర్చులు అదుపులో ఉంటాయి. కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఒక సంఘటన ఉత్సాహాన్నిస్తుంది. ప్రమోషన్, మార్కెటింగ్ రంగాల వారికి ఈ రోజు బాగా లాభదాయకంగా ఉంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ప్రారంభించిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు పాటించకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. ఒక సంఘటన మనసు కలచి వేస్తుంది. వివాదరహితంగా ఉండేందుకు ప్రయత్నించండి. మానసికంగా ప్రశాంతంగా ఉంటే మంచిది.

సింహం (Leo) 

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఇంటా బయట మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారులకు ఇది అనుకూలమైన రోజు కాదు. నష్ట భయం ఉంది కాబట్టి ఆచి తూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలు వస్తాయి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ధనయోగాలున్నాయి. పెట్టుబడులు, లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాల్లో బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే సూచన ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అదృష్టయోగం ఉంది. ప్రజాదరణ, పరపతి పెరుగుతాయి. పరోపకార కార్యక్రమాలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో సాహసోపేతమైన నిర్ణయాలతో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రోత్సాహం, గుర్తింపు లభిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగులు పదోన్నతులు, గౌరవం పొందుతారు. మీ సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సన్నిహితుల నుంచి విలువైన కానుకలు అందుకుంటారు. శుభవార్తలు వింటారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలను పెద్దల సహకారంతో అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం, ఒత్తిడి పెరుగుతాయి. ఇంటా బయట మీ మాటతీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రణాళిక లోపంతో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. అవివాహితులకు కల్యాణ యోగం ఉంది. కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో మనస్పర్థలకు అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కీలక నిర్ణయాల విషయంలో స్ఫష్టమైన విధానంతో ముందుకు సాగాలి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరమైన అభివృద్ధికి సంబంధించిన ఆటంకాలు తొలగి పోతాయి. కార్యసిద్ధి, శత్రుజయం ఉంటాయి. వ్యాపార వ్యవహారాలన్నీ అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో చక్కగా రాణిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. ఆర్థిక లాభాలు ఉత్సాహం కలిగిస్తాయి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అవరోధాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కీలక నిర్ణయాల విషయంలో గందరగోళానికి గురవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో బుద్ధిబలంతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. ఖర్చులు తెలివిగా నిర్వహించాలి. కొందరి ప్రవర్తన మనస్థాపం కలిగిస్తుంది.