Jr NTR | యంగ్ టైగర్ కోపంగా ఉన్నా సరే.. లక్ష్మీ ప్రణతి అలా పిలవగానే ఫ్లాట్ అంతే!
Jr NTR | వివాహం అనేది వందేళ్ళ బంధం. అలాంటి బంధంలో మహా అయితే పదేళ్లు కూడా కలిసి ఉండలేక పోతున్నారు ఇప్పటి వాళ్ళు. ఇక సినిమా వాళ్ళ వివాహాలైతే మరీ పెళుసుగా తయారవుతున్నాయి. ఓ రెండేళ్ళు ప్రేమించుకుని, మరో రెండేళ్ళు పెళ్ళితో కలిసి ఉంటున్నారో లేదో.. ఏవో మనస్పర్థలతో విడి పోతున్నామని, మా జీవితాలను మేము ఇక నుంచి సంతోషంగా జీవించాలనే నిర్ణయం తీసుకున్నామని, మంచి స్నేహితులుగా ఇక నుంచి కొనసాగాలనుకుంటున్నామనే స్టేట్మెంట్స్ ఇచ్చి మరీ […]

Jr NTR |
వివాహం అనేది వందేళ్ళ బంధం. అలాంటి బంధంలో మహా అయితే పదేళ్లు కూడా కలిసి ఉండలేక పోతున్నారు ఇప్పటి వాళ్ళు. ఇక సినిమా వాళ్ళ వివాహాలైతే మరీ పెళుసుగా తయారవుతున్నాయి. ఓ రెండేళ్ళు ప్రేమించుకుని, మరో రెండేళ్ళు పెళ్ళితో కలిసి ఉంటున్నారో లేదో.. ఏవో మనస్పర్థలతో విడి పోతున్నామని, మా జీవితాలను మేము ఇక నుంచి సంతోషంగా జీవించాలనే నిర్ణయం తీసుకున్నామని, మంచి స్నేహితులుగా ఇక నుంచి కొనసాగాలనుకుంటున్నామనే స్టేట్మెంట్స్ ఇచ్చి మరీ విడిపోతున్నారు.
ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ఇద్దరి వివాహం అయ్యి చాలా కాలమే అవుతుంది. వీళ్ళిద్దరికీ ఇద్దరు మగ సంతానం కూడా ఉన్నారు. ఇల్లు, పిల్లలు, భర్త వీళ్ళతోడే తన ప్రపంచంగా చక్కగా కాపురం చేసుకుంటుంది ప్రణతి. ఎన్టీఆర్ కన్నా వయసులో చిన్న పిల్లని పెళ్ళి చేసుకుంటున్నాడని, ఇదంతా డబ్బుకోసమేననే వాదనల మధ్య మరదలు వరస అయ్యే లక్ష్మీ ప్రణతిని పెళ్ళాడాడు ఎన్టీఆర్.
ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారనడానికి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించే వాళ్ళిద్దరి ఫోటోస్ చెప్పకనే చెబుతాయి. అయితే లక్ష్మీ ప్రణతి తన భర్త, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్‌ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ ఇద్దరి మధ్య పిలుపులు ఎలా ఉంటాయ్ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ కాస్త ఆసక్తిగా మారింది.
ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతితో కాస్త రొమాంటిక్‌గా ఉంటాడని, వాళ్ళిద్దరి మధ్య పిలుపులు కూడా అంతే అందంగా ఉంటాయనే విషయం ముచ్చటేస్తుంది. ఇక సైలెంట్‌గా కనిపించే ప్రణతి ఎన్టీఆర్‌తో జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఉంటుందట. ఇక ఎన్టీఆర్‌కి బావా అని పిలిపించుకోవడం ఇష్టంగా ఉండటంతో ప్రణతి, ఎన్టీఆర్‌ని బావా అనే పిలుస్తుందట.
ఇలా పిలవాలనే విషయాన్ని ప్రణతి నిశ్చితార్థం రోజునే ఫిక్స్ అయిందట. బావా అని పిలవగానే ఎన్టీఆర్ కోపంగా ఉన్నా సరే వెంటనే మూడ్ మారిపోయి నార్మల్ అయిపోతాడని తెలుస్తుంది. ఏది ఏమైనా అన్యోన్య దాంపత్యానికి ఇలాంటి సరదాలు, సరసాలు కూడా అవసరమే.. వీళ్ళ బంధం మరింత పచ్చగా ఉండాలని కోరుకుందాం.