ప్రశ్నించే గొంతుకలపై గుండాయిజం.. మీడియా అంటే మీకెందుకంత భయం..?
తీన్మార్ మల్లన్న టీం విధాత: తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఎలాంటి తప్పు చేయనప్పుడు మీడియా అంటే ఎందుకంత భయపడుతున్నారని తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి, స్టేట్ కమిటీ మెంబర్ రాము నాయక్ మరియు జర్నలిస్టు మిత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మహబూబ్‌నగర్ తెలంగాణ బీసీ సంఘం కార్యాలయంలో తీన్మార్ మల్లన్న టీంతో పాటు జర్నలిస్టు మిత్రులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఒక్కో ఛానెల్‌ను టార్గెట్ చేస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్న […]

- తీన్మార్ మల్లన్న టీం
విధాత: తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఎలాంటి తప్పు చేయనప్పుడు మీడియా అంటే ఎందుకంత భయపడుతున్నారని తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి, స్టేట్ కమిటీ మెంబర్ రాము నాయక్ మరియు జర్నలిస్టు మిత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మహబూబ్‌నగర్ తెలంగాణ బీసీ సంఘం కార్యాలయంలో తీన్మార్ మల్లన్న టీంతో పాటు జర్నలిస్టు మిత్రులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఒక్కో ఛానెల్‌ను టార్గెట్ చేస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్న నాయకుల్లారా ఖబర్దార్ అని హెచ్చరించారు. మొన్న V6 వెలుగు, తొలివెలుగు రఘు పై నిన్న క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడులు చేయడం అధికార పార్టీ నాయకులకు సిగ్గు చేటన్నారు. మీరు చేసే మూర్ఖపు పనులను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారని, అధికారం శాశ్వతం కాదన్న విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు. లేదు.. కాదు.. కూడదు అని మళ్ళీ దాడులకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి ,స్టేట్ కమిటీ మెంబర్ రాము నాయక్, తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనెల శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ మెట్టుకాడి ప్రభాకర్, సంతోష్, ఆయా పత్రికా, ఛానెళ్ల జర్నలిస్ట్ మిత్రులు పాల్గొన్నారు.