Vijay Varma | ఆ విషయంలో ఇబ్బందిగా ఉంది.. తమన్నాతో బయటకు వెళ్ళను: విజయ్ వర్మ

Vijay Varma | కాస్త పాపులారిటీ వస్తేనే జనాల్లో తిరగడానికి ఇబ్బందిగా ఉందని ముఖాలు చాటేసి తిరుగుతారు సినీ సెలబ్రెటీలు. అలాంటిది ఆమె కనిపించిందంటే అటు మీడియా, ఇటు అభిమానులు అంతా వెనకబడి ఫోటోలకు ఫోజులివ్వమని, సిగ్నేచర్ అడుగుతూ వెనకపడతారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇప్పుడిదే ఆమెతో ప్రేమలో ఉన్న వ్యక్తికి ఇబ్బందిగా మారిందట.. అందుకే తనతో ఇక మీదట కలిసి బైటకు వెళ్ళకూడదనుకుంటున్నానని కామెంట్స్ చేసాడు. ఎవరా ప్రేమికులు.. ఏంటా కథ తెలుసుకుందామా? మిల్కీ […]

  • By: krs    latest    Aug 25, 2023 2:42 AM IST
Vijay Varma | ఆ విషయంలో ఇబ్బందిగా ఉంది.. తమన్నాతో బయటకు వెళ్ళను: విజయ్ వర్మ

Vijay Varma |

కాస్త పాపులారిటీ వస్తేనే జనాల్లో తిరగడానికి ఇబ్బందిగా ఉందని ముఖాలు చాటేసి తిరుగుతారు సినీ సెలబ్రెటీలు. అలాంటిది ఆమె కనిపించిందంటే అటు మీడియా, ఇటు అభిమానులు అంతా వెనకబడి ఫోటోలకు ఫోజులివ్వమని, సిగ్నేచర్ అడుగుతూ వెనకపడతారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇప్పుడిదే ఆమెతో ప్రేమలో ఉన్న వ్యక్తికి ఇబ్బందిగా మారిందట.. అందుకే తనతో ఇక మీదట కలిసి బైటకు వెళ్ళకూడదనుకుంటున్నానని కామెంట్స్ చేసాడు. ఎవరా ప్రేమికులు.. ఏంటా కథ తెలుసుకుందామా?

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గత పది పదిహేనేళ్ళుగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి హీరోయిన్ గుర్తింపునే తెచ్చుకుంది. అలాగే అటు చిన్నా, పెద్ద టాప్ హీరోలందరితోనూ వరుసగా నటించేసింది కూడా. తన ఖాతాలో చాలా హిట్ మూవీసే ఉన్నాయి. ఇక ఈమధ్య కాలంలో ఇంకాస్త గ్లామర్ యాడ్ చేయడంతో అమ్మడి పాపులారిటీ ఏ రేంజ్‌కి చేరుకుందంటే.. ఆమె నటించిన సినిమా ప్లాప్ అయినా సరే ఆమె వెంటపడే ఫ్యాన్స్, ఫాలోయింగ్‌లో మాత్రం ఎలాంటి తేడా రావడం లేదు. అంతకంతకు పెరుగుతూనే ఉంది.

దీనికి గ్లామర్ డోసు పెంచడం, అలాగే హాట్ సీన్స్‌లో కనిపించడం, ఇంకాస్త ముందుకెళ్ళి కుర్రకారుకు కిక్ పెంచేలా హాట్ ఫోటో షూట్స్ చేయడం లాంటి పనులు తమన్నాని లైమ్‌లైట్‌లో నిలబెట్టాయి. రీసెంట్‌గా తమన్నా చిరంజీవి నటించిన ‘భోళాశంకర్’లో.. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘జైలర్’ వంటి సినిమాలలో నటించింది.

అయితే ఇవన్నీ ఆమె ప్రేమకు అడ్డంగా మారుతున్నాయా? అంటే ఇన్‌డైరెక్ట్‌గా అదే అంటున్నాడు నటుడు, తమన్నా లవర్ విజయ్ వర్మ. వీళ్ళిద్దరి మధ్యా ప్రేమ ఉందనే సంగతి ముందుగా బయట పెట్టింది తమన్నానే. తన ప్రేమ గురించి తమన్నా ఓపెన్‌గా చెప్పేసింది. ‘లస్ట్ స్టోరీస్ 2’ ప్రమోషన్స్‌లో విజయ్‌తో ఉన్న ప్రేమ విషయం రివీల్ చేసింది తమన్నా.

అప్పటినుంచి ఎక్కడకు వెళ్ళినా వీళ్ళ ఇద్దరి మీదా కాస్త స్పెషల్ ఫోకస్ ఎక్కువైంది. అయితే ఇదే ఇబ్బందిగా మారింది విజయ్ వర్మకి. తను తన లైఫ్‌ని కాస్త గుంభనంగా ఉంచాలని అనుకుంటుంటే.. తమన్నాతో బయటకు వెళుతున్న ప్రతి సారీ మీడియా కళ్ళు వారి మీదనే పడటం అస్సలు నచ్చడం లేదంట. ఇది ఇబ్బందిగా అనిపిస్తుందని.. అందుకే ఇక మీదట తనతో కలిసి బయటకు వెళ్ళ కూడదు అనుకుంటున్నా అని ఫన్నీగానే చెప్పాడు విజయ్ వర్మ.

అలాగే ప్రేక్షకులు, అటు మీడియాలలో మాకు ఇంత గొప్ప స్థానం ఉందని తెలిశాక ఇంకా ఆశ్చర్యపోయానంటున్నాడు. కానీ ప్రైవసీని మిస్ అవుతున్నందుకు మాత్రం కాస్తంత బాధగానే ఉందని చెప్పుకొచ్చాడు. అవ్వా కావాలి.. బువ్వా కావాలి అంటూ విజయ్ వర్మ మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.