Viral Video | జిమ్‌లో 68 ఏళ్ల బామ్మ వర్క్ అవుట్స్.. నెటిజన్లు ఫిదా
Viral Video | సాధారణంగానే మహిళలు జిమ్‌కు వెళ్లరు. వృద్ధ్యాపం వచ్చిందంటే చాలు ఇంటికే పరిమితం అవుతుంటారు. కానీ ఓ బామ్మ మాత్రం ప్రతి రోజూ జిమ్‌కు వెళ్తుంది. ఏదో సాదాసీదాగా వర్క్ అవుట్స్ చేయడం లేదు ఆమె.. పురుషులకు పోటీగా వెయిట్ లిఫ్ట్ ఎత్తి.. అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఆ వృద్ధురాలి వర్క్ అవుట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 68 ఏండ్ల బామ్మ.. తన కుమారుడితో కలిసి ప్రతి రోజూ జిమ్‌కు వెళ్తుంది. […]

Viral Video | సాధారణంగానే మహిళలు జిమ్‌కు వెళ్లరు. వృద్ధ్యాపం వచ్చిందంటే చాలు ఇంటికే పరిమితం అవుతుంటారు. కానీ ఓ బామ్మ మాత్రం ప్రతి రోజూ జిమ్‌కు వెళ్తుంది. ఏదో సాదాసీదాగా వర్క్ అవుట్స్ చేయడం లేదు ఆమె.. పురుషులకు పోటీగా వెయిట్ లిఫ్ట్ ఎత్తి.. అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఆ వృద్ధురాలి వర్క్ అవుట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
68 ఏండ్ల బామ్మ.. తన కుమారుడితో కలిసి ప్రతి రోజూ జిమ్‌కు వెళ్తుంది. అక్కడ అన్ని రకాల వ్యాయామాలు చేస్తుందామె. ఇక కుమారుడు అజయ్ సంగ్వాన్ సూచనలతో కఠినమైన వర్క్ అవుట్స్ కూడా చేస్తుంది. మగాళ్లకు పోటీగా వెయిట్ లిఫ్ట్ ఎత్తుతుంది ఆమె. ఇక తన తల్లి వర్క్ అవుట్స్ వీడియోలను ఎప్పటికప్పుడు అజయ్ ఇన్‌స్టా గ్రామ్ వేదికగా పంచుకుంటున్నాడు. ఇందుకోసం వెయిట్ లిఫ్టర్ మమ్మీ అనే ఇన్‌స్టా ఖాతాను కూడా ఓపెన్ చేశాడు. ఈ ఖాతాను 6 వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు.
బామ్మ వెయిట్ లిఫ్టింగ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వృద్ధ్యాపంలో ఇలాంటి వర్క్ అవుట్స్ చేయడం గొప్ప విషయమని కితాబిస్తున్నారు. ఇతర మహిళలకు మీరు స్ఫూర్తి అని పేర్కొంటున్నారు. ఇలాంటి కొడుకులు కావాలని ఈ దేశం కోరుకుంటోందని రాసుకొచ్చారు.
View this post on Instagram