ప్ర‌భుత్వ నిధులు తీసుకొని ప్రియుళ్ల‌తో వెళ్లిపోయిన వివాహిత‌లు..

Uttar Pradesh | ప్ర‌ధాన మంత్రి అర్బ‌న్ హౌసింగ్ స్కీమ్ కింద విడుద‌లైన నిధుల‌తో ఓ ఐదుగురు వివాహిత‌లు త‌మ ప్రియుళ్ల‌తో వెళ్లిపోయారు. దీంతో ఆ మ‌హిళ‌ల భ‌ర్త‌లు ల‌బోదిబో మంటున్నారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బారాబంకీ జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌ధాన మంత్రి అర్బ‌న్ హౌసింగ్ స్కీం కింద బారాబంబ‌కీ జిల్లాలో 40 మంది మ‌హిళ‌లను ఎంపిక చేశారు. ఈ ప‌థ‌కం కింద సొంత జాగ ఉన్న నిరుపేద‌ల‌కు ఇల్లు నిర్మించుకునేందుకు రూ. […]

ప్ర‌భుత్వ నిధులు తీసుకొని ప్రియుళ్ల‌తో వెళ్లిపోయిన వివాహిత‌లు..

Uttar Pradesh | ప్ర‌ధాన మంత్రి అర్బ‌న్ హౌసింగ్ స్కీమ్ కింద విడుద‌లైన నిధుల‌తో ఓ ఐదుగురు వివాహిత‌లు త‌మ ప్రియుళ్ల‌తో వెళ్లిపోయారు. దీంతో ఆ మ‌హిళ‌ల భ‌ర్త‌లు ల‌బోదిబో మంటున్నారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బారాబంకీ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌ధాన మంత్రి అర్బ‌న్ హౌసింగ్ స్కీం కింద బారాబంబ‌కీ జిల్లాలో 40 మంది మ‌హిళ‌లను ఎంపిక చేశారు. ఈ ప‌థ‌కం కింద సొంత జాగ ఉన్న నిరుపేద‌ల‌కు ఇల్లు నిర్మించుకునేందుకు రూ. 3 ల‌క్ష‌లు ఇస్తారు. అయితే మొద‌టి ద‌ఫా కింద రూ. 50 వేల చొప్పున మ‌హిళ‌ల ఖాతాల్లో ప్ర‌భుత్వం జ‌మ చేసింది. ఇక ఇందులో ఐదుగురు మ‌హిళ‌లు ఆ డ‌బ్బుల‌ను డ్రా చేశారు. ఆ త‌ర్వాత వాటిని ఇంటి నిర్మాణ ప‌నుల‌కు వినియోగించ‌లేదు. ఆ న‌గ‌దుతో భ‌ర్త‌ల‌ను వ‌దిలేసి, ప్రియుళ్ల‌తో వెళ్లిపోయారు. దీంతో బాధిత భ‌ర్త‌లు త‌మ భార్య‌ల వ్య‌వ‌హారం గురించి అధికారుల‌కు, పోలీసులకు తెలిపారు. రెండో విడ‌త నిధుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌మ భార్య‌ల ఖాతాల్లో జ‌మ చేయొద్ద‌ని అధికారుల‌ను వేడుకున్నారు.

ప్ర‌ధాన మంత్రి అర్బ‌న్ హౌసింగ్ స్కీం కింద మొత్తం రూ. 3 ల‌క్ష‌లు ఇస్తారు. మొద‌టి విడ‌త‌లో రూ. 50 వేలు, రెండో విడత‌లో రూ. 1,50,000, మూడో విడ‌త‌లో మిగిలిన న‌గ‌దును చెల్లిస్తారు.