ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ షెడ్యూల్‌ ఖరారు..! తొలి మ్యాచ్‌ ఎప్పుడంటే..?

Women's Premier League | ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ షెడ్యూల్‌ దాదాపు ఖరారైంది. తొలి సీజన్‌ మార్చి 4 నుంచి షురూ కానుంది. ప్రారంభ మ్యాచ్‌ ముంబయి - అహ్మదాబాద్‌ జట్ల మధ్య జరుగనున్నది. ప్రీమియర్‌ లీగ్‌ మొత్తం 23 రోజుల పాటు కొనసాగనుండగా.. ఫైనల్‌ మ్యాచ్‌ 26న జరుగనున్నది. అయితే, లీగ్‌కు సంబంధించి బీసీసీఐ ఎలాంటి అధికారిక సమాచారం ప్రకటించాల్సి ఉంది. ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ను అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. లీగ్‌ మొదటి మ్యాచ్‌లో […]

ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ షెడ్యూల్‌ ఖరారు..! తొలి మ్యాచ్‌ ఎప్పుడంటే..?

Women’s Premier League | ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ షెడ్యూల్‌ దాదాపు ఖరారైంది. తొలి సీజన్‌ మార్చి 4 నుంచి షురూ కానుంది. ప్రారంభ మ్యాచ్‌ ముంబయి – అహ్మదాబాద్‌ జట్ల మధ్య జరుగనున్నది. ప్రీమియర్‌ లీగ్‌ మొత్తం 23 రోజుల పాటు కొనసాగనుండగా.. ఫైనల్‌ మ్యాచ్‌ 26న జరుగనున్నది. అయితే, లీగ్‌కు సంబంధించి బీసీసీఐ ఎలాంటి అధికారిక సమాచారం ప్రకటించాల్సి ఉంది. ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ను అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. లీగ్‌ మొదటి మ్యాచ్‌లో ముంబయి – అహ్మదాబాద్‌ జట్లు తలపడనున్నాయి. ముంబయి జట్టు ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీకి చెందినది కాగా.. అహ్మదాబాద్‌ జట్టు ఓనర్‌ గౌతమ్‌ అదానీ. ఈ మ్యాచ్‌లో ఇద్దరు బడా పారిశ్రామికవేత్తలు పరోక్షంగా పోటీపడనున్నారు.

మ్యాచ్‌లు ఆ స్టేడియాల్లోనే..

ముంబయిలోని డీవై పాటిల్‌ స్టేడియంలో ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ను ప్రారంభించాలని బీసీసీఐ యోచిస్తున్నది. లీగ్‌ను ముంబయిలోని సీసీఐ, డీవై పాటిల్‌ స్టేడియాల్లో నిర్వహించే అవకాశం ఉంది. వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌లు జరిగే అవకాశం లేదు. ఎందుకంటే భారత పురుషుల జట్టు మార్చిలో ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్‌ ఆడనున్నది. ఏప్రిల్‌లో నిర్వహించే ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఈ స్టేడియంలో జరుగనున్నాయి. ఐపీఎల్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంది. ఇక ఉమెన్స్‌ లీగ్‌ రెండో మ్యాచ్‌ మార్చి 5న బెంగళూరు – ఢిల్లీ జట్ల మధ్య సీసీఐ స్టేడియంలో జరుగనున్నది.

ఆ జట్టు నేరుగా ఫైనల్‌కు..

సమాచారం ప్రకారం.. ప్రీమియర్‌ లీగ్‌లో మొత్తం ఐదు జట్లున్నాయి. ఇందులో మూడుజట్లు ప్లే ఆఫ్‌కు చేరుకుంటాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత స్ధాిస్తుంది. రెండు, మూడుస్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులో విజయం సాధించిన జట్టు ఫైనల్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుతో తలపడనున్నది. పాయింట్ల పట్టికలో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచిన జట్లు లీగ్‌ దశలోనే వైదొలుగుతాయి. ఈ లీగ్‌లో మొత్తం 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. 23 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో ఐదు రోజులు అంటే.. మార్చి 17, 19, 22, 23, 25 తేదీల్లో మ్యాచ్‌లు జరుగవు. 21న లీగ్‌ దశ ముగియగా.. ఆ తర్వాత 24న ఎలిమినేటర్‌ మ్యాచ్‌, టైటిల్‌ మ్యాచ్‌ 26న జరగనుంది.