• Telugu News
  • /Latest

వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి

వైఎస్ షర్మిల ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు

Reported by: Somu | latest | Jan 01, 2024, 3:58 am IST
Read Time: 2 mins
వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి
  • 17న కుమారుడు వైఎస్ రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్థం


విధాత: వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలా రెడ్డి ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఈ 2024 సంవత్సరంలో తన కుమారుడి వివాహం జరగనున్నట్లు న్యూ ఇయర్ విషెస్ తో పాటు తీపి కబురు అందించారు. కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఓ ఇంటివాడు కాబోతున్నట్లు చెప్పారు. అట్లూరి ప్రియతో ఈనెల 18న నిశ్చితార్థం జరగనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరగనున్న సంగతిని మీతో పంచుకోవడం ఆనందంగా ఉందని షర్మిల అన్నారు.