YS Sharmila : అవసరమైన సమయంలో నా కొడుకు రాజకీయాల్లోకి

కర్నూల్ ఉల్లి రైతులను పరామర్శించిన వైఎస్ షర్మిల, తనయుడు వైఎస్ రాజారెడ్డి అవసరమైన సమయంలో ఏపీ రాజకీయాల్లోకి వస్తారని ప్రకటించారు.

YS Sharmila : అవసరమైన సమయంలో నా కొడుకు రాజకీయాల్లోకి

అవసరమైనప్పుడు తన కొడుకు రాజకీయాల్లోకి వస్తారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. సోమవారం నాడు కర్నూల్ లో ఉల్లి రైతులను వైఎస్ షర్మిలతో కలిసి ఆమె తనయుడు వైఎస్ రాజారెడ్డి మాట్లాడారు. ఉల్లి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధర పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కర్నూల్ ఉల్లి రైతులను షర్మిల పరామర్శించారు. తల్లితో కలిసి రాజారెడ్డి కర్నూల్ కు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో షర్మిల మాట్లాడారు. అవసరమైన సమయంలో ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ రాజారెడ్డి వస్తారని ఆమె చెప్పారు. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆమె కోరారు. ఉల్లి రైతులకు క్వింటాల్ కు రూ. 3 వేలు చెల్లించాలని కోరారు. కర్నూల్ పర్యటనకు హైదరాబాద్ నుంచి వెళ్లే సమయంలో అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీస్సులను వైఎస్ రాజారెడ్డి తీసుకున్నారు.

ఉల్లి పంటకు ధర పడిపోయింది. గత ఏడాది క్వింటాల్ రూ. 5 వేలు కొనుగోలు చేశారు. ఈ సారి ఉల్లి ధర క్వింటాల్ కు రూ. 600కు పడిపోయింది. వర్షాలు కురుస్తున్నందున 90 రోజులకు బదులుగా 70 రోజులకే ఉల్లి పంటను తీశారు. దీంతో ఉల్లిపాయల నాణ్యత, సైజు తగ్గింది. ఇది కూడా ఉల్లిపాయల ధర తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. దీంతో కర్నూల్ మార్కెట్ లో ఉల్లి రైతులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ కు ఉల్లిని రూ. 1200 కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఉల్లి రైతులతో మాట్లాడి వారి సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు షర్మిల ఇవాళ కర్నూల్ మార్కెట్ లో పర్యటించారు.