YS Sharmila | ఆధారాలున్నందునే మేం మాట్లాడుతున్నాం
వైఎస్.వివేకానందరెడ్డి హత్యపై అవినాశ్‌రెడ్డి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారంటు వైఎస్ షర్మిల, సునితలపై మేనత్త వైఎస్.విమలారెడ్డి చేసిన వ్యాఖ్యలను వైఎస్. షర్మిల తిప్పికొట్టారు
విమలమ్మ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల కౌంటర్
విధాత: వైఎస్.వివేకానందరెడ్డి హత్యపై అవినాశ్‌రెడ్డి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారంటు వైఎస్ షర్మిల, సునితలపై మేనత్త వైఎస్.విమలారెడ్డి చేసిన వ్యాఖ్యలను వైఎస్. షర్మిల తిప్పికొట్టారు. ఎన్నికల ప్రచార క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్.వివేకానంద రెడ్డి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదని, సీబీఐ చూపించిన ఆధారాలు మాత్రమే మేము ఎత్తి చూపుతున్నామని స్పష్టం చేశారు. ఆధారాలు ఉండబట్టే.. పలానావాళ్లు హత్య చేయించారనే విషయం మాకు తెలిసింది కాబట్టే మాట్లాడుతున్నామన్నారు.
ఈ హత్యా రాజకీయాలు ఆగాలని, హంతకులు చట్టసభల్లోకి వెళ్లొద్దనే అక్కా చెల్లెల్లిద్దరం పోరాటం చేస్తున్నామని పేర్కోన్నారు. విమలమ్మ కొడుకుకి జగన్ వర్క్స్ ఇవ్వడంతో వారు ఆర్థికంగా బలపడ్డారన్నారు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని చనిపోయిన సొంత అన్న వివేకానందరెడ్డి తనకు ఎంత చేశారన్న విషయం విమలమ్మ మరిచిపోయి ఉంటారని, సొంత అన్న వివేకానంద రెడ్డి హత్య విషయం మరిచిపోతే ఎట్లా అని షర్మిల ప్రశ్నించారు. వయసు మీద పడి మరిచిపోయినట్లున్నారని, అందులోనూ వేసవి కాలమని అందుకే విమలమ్మ అలా మాట్లాడుతున్నారని చురకలేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram