Panchakarla Ramesh Babu | వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి పంచకర్ల రాజీనామా

Panchakarla Ramesh Babu విధాత‌: సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఈ స్థాయిలో నిరసన ఎన్నడూ వ్యక్తం కాలేదు. పార్టీలో ఉన్న వాళ్ళంతా ఆయన చెప్పినట్లు.. ఆయనకు నచ్చినట్లు నడుస్తూ వచ్చారు తప్ప ఎవరూ గొంతెత్తి తన నిరసన వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. కొందరు అసంతృప్తులు ఉన్నప్పటికీ ఎక్కడా బయటపడలేదు. కానీ తొలిసారిగా ఉత్తరాంధ్రలో జగన్‌కు గట్టి రీ సౌండ్ వినిపించింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన పంచకర్ల రమేష్ బాబు విశాఖ జిల్లా అధ్యక్ష‌ పదవికి […]

Panchakarla Ramesh Babu | వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి పంచకర్ల రాజీనామా

Panchakarla Ramesh Babu

విధాత‌: సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఈ స్థాయిలో నిరసన ఎన్నడూ వ్యక్తం కాలేదు. పార్టీలో ఉన్న వాళ్ళంతా ఆయన చెప్పినట్లు.. ఆయనకు నచ్చినట్లు నడుస్తూ వచ్చారు తప్ప ఎవరూ గొంతెత్తి తన నిరసన వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. కొందరు అసంతృప్తులు ఉన్నప్పటికీ ఎక్కడా బయటపడలేదు. కానీ తొలిసారిగా ఉత్తరాంధ్రలో జగన్‌కు గట్టి రీ సౌండ్ వినిపించింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన పంచకర్ల రమేష్ బాబు విశాఖ జిల్లా అధ్యక్ష‌ పదవికి రాజీనామా చేశారు.

కాగా.. తనకు పార్టీలో ప్రాధాన్యం లేదని.. తన మాట వినేవాళ్ళు లేరని, తానూ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి దృష్టికి కొన్ని అంశాలు తీసుకుపోవాలని చూస్తున్నా కుదరడం లేదని.. తనకు పార్టీలో ప్రాధాన్యం లేదని అయన చెబుతున్నారు. వాస్తవానికి అయన విశాఖ నుంచి జనసేన తరఫున పోటీకి రెడీ అయ్యారని, అందుకే ఇక్కడ నుంచి వెళ్లిపోతున్నారని అంటున్నారు.

పంచకర్ల రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో నుంచి పెందుర్తిలో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనమైంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2014లో గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్‌తో కలిసి రమేష్ టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

మళ్ళీ 2019లో అక్కడే పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కన్నబాబు చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత అయన వైఎస్సార్‌సీపీలో చేరగా ఆయనకు విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్ష పదవిని అప్పగించారు జగన్. అయితే అయన మళ్ళీ పోటీ చేసేందుకు ఎక్కడ సీట్ దక్కే అవకాశాలు లేకపోవడం .. పార్టీలో ప్రాధాన్యం లేకపోవడంతో పార్టీని వీడినట్లు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో పెందుర్తి లేదా యలమంచిలిలో జనసేన నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు చెబుతున్నారు .