Health | రోజు 10వేల అడుగులతో శరీరంలో వచ్చే మార్పులేంటో తెలుసా?

వాకింగ్ ప్రతి ఒక్కరూ చేయాలనుకుంటారు. తమ రోజూవారి అలవాట్లలో చాలా మంది నడకను చేర్చుకుంటారు. కొందరు టైం లేక.. మరికొందరు బద్ధకంతో వాకింగ్ చేయరు. రోజు 10వేల అడుగులు వేయడం వల్ల మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనం చేకూరుతుంది.

Health | రోజు 10వేల అడుగులతో శరీరంలో వచ్చే మార్పులేంటో తెలుసా?

వాకింగ్ ప్రతి ఒక్కరూ చేయాలనుకుంటారు. తమ రోజూవారి అలవాట్లలో చాలా మంది నడకను చేర్చుకుంటారు. కొందరు టైం లేక.. మరికొందరు బద్ధకంతో వాకింగ్ చేయరు. రోజు 10వేల అడుగులు వేయడం వల్ల మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనం చేకూరుతుంది. శరీరంతో పాటు మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది కూడా. రోజుకు 10,000 అడుగులు నడవడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ ఫిట్‌నెస్ ట్రెండ్ గా మారింది. అయితే దీన్ని ఒక నెల పాటు క్రమంగా కొనసాగిస్తే శరీరం, మనసులో ఏ మార్పులు వస్తాయో తెలుసా? నడక అనే సాదాసీదా అలవాటు ఆరోగ్యాన్ని ఎంతగానో మార్చేస్తుంది.

అడుగులతో హృదయం పదిలం..

ఒక నెల పాటు ప్రతిరోజూ 10,000 అడుగులు నడిస్తే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రెస్టింగ్ హార్ట్ రేట్ తగ్గి హృదయానికి బలం చేకూరుతుంది. రక్తపోటు ప్రమాదం తగ్గి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.

బరువును నియంత్రిస్తుంది..

రోజుకు 10,000 అడుగులు నడిస్తే సుమారు 300 నుంచి 500 కేలరీలు ఖర్చు అవుతాయి. దీన్ని నెల రోజుల పాటు కొనసాగిస్తే పొట్ట, తొడల వద్ద కొవ్వు తగ్గడం స్పష్టంగా కనిపిస్తుంది. బరువు నిమంత్రించుకోవాలి అని అనుకునేవారికి ఇది ఎంతో ఉపయోగకరమైన పద్దతిగా చెప్పొచ్చు.

స్ట్రెస్ తగ్గడంలో కీలకం

నడక వల్ల ఎండార్ఫిన్స్ పెరిగి, స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి. కొద్ది రోజులకే మూడ్ మెరుగవుతుంది, ఒత్తిడి కూడా తగ్గుతుంది. రోజూ నడిచే అలవాటు ఉన్నవారి మెదడుకి సహజమైన డిటాక్స్‌లా పనిచేస్తుంది.

బలమైన కండరాల నిర్మాణం

క్రమంగా రోజు నడవడం వల్ల కాళ్ల కండరాలు, గ్లూట్స్, కోర్ మసిల్స్ బలంగా మారుతాయి. అలాగే, జాయింట్స్ లో కఠినత్వం తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఒక నెల తరువాత బ్యాలెన్స్, పొజిషన్, నడుము నొప్పి తగ్గడం వంటి మార్పులు గమనించవచ్చు.

నిద్ర నాణ్యత పెరుగుతుంది

రోజూ 10,000 అడుగులు నడిచేవారికి ఘాడ నిద్రతో పాటు ప్రశాంతమైన నిద్రకు అవకాశం ఉంటుంది. శరీర శ్రమ పెరగడం, స్ట్రెస్ తగ్గడం వల్ల నిద్ర త్వరగా పడుతుంది.

శక్తివంతమైన శరీరం

నడవడం వల్ల అలసట తగ్గి శక్తి పెరుగుతుంది. ఒక నెల తరువాత రోజంతా ఫ్రెష్‌గా, యాక్టివ్‌గా అనిపిస్తుంది. మధ్యాహ్నం వచ్చే అలసట కూడా తగ్గిపోతుంది. అలాగే, నడక వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. మలబద్ధకం తగ్గి, పొట్ట రావడం తగ్గుతుంది. మెటబాలిజం వేగంగా పని చేసి శరీరంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది.  కాగా, 10,000 అడుగులు నడక ఒక్కటే అందరికీ భారీగా బరువు తగ్గించకపోయినప్పటికీ, మానసిక ఆరోగ్యం, శారీరక బలం, హృదయ ఆరోగ్యం, నిద్ర నాణ్యతలతో పాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రోజు 10వేల అడుగులు వేసేందుకు రెడీగా ఉండండి.