Health Tips | గుడ్డులోని పచ్చసొన తినడం వల్ల గుండెపోటు వస్తుందా..? ఎంత వరకు నిజం..!
Health Tips | కరోనా తదుపరి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం( Health ) పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే డైట్( Diet ) ఫాలో అవుతున్నారు. మరి ముఖ్యంగా గుండె సమస్యలకు( Heart Problems ) సంబంధించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటున్నారు. అయితే గుడ్డు( Egg )లోని పచ్చసొన( Egg Yolk ) తినడం వల్ల గుండెపోటు( Heart Stroke ) వస్తుందా..? ఇది ఎంత వరకు నిజం అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.
Health Tips | శరీరంలో రోగ నిరోధకశక్తి( Immunity Power )ని పెంపొందించేందుకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని తీసుకుంటారు. ఇందులో భాగంగా ప్రతి రోజు ఒక కోడి గుడ్డు( Egg ) తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు( Health Experts ) చెబుతుంటారు. అయితే ఈ కోడిగుడ్డులోని పచ్చసొన( Egg Yolk ) వల్ల గుండెపోటు( Heart Stroke ) వచ్చే అవకాశం ఉందనే అపోహా కూడా ఉంది. ఈ క్రమంలో చాలా మంది గుడ్డులోని తెల్లసొన వరకు మాత్రమే తింటారు. మరి పచ్చసొన తినడం వల్ల నిజంగానే గుండెపోటు వస్తుందా..? ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాలను ఈ కథనంలో సమగ్రంగా తెలుసుకుందాం.
గుడ్డులోని పచ్చసొనతో గుండె పోటు వస్తుందా..?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు ఒక కోడిగుడ్డును తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. గుడ్డు శరీరానికి అనేక ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. రోగనిరోధక శక్తి కూడా పెంపొందుతుంది. రోజుకు ఒక కోడిగుడ్డును తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం లేదని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే మన శరీరంలో 80 శాతం కొలెస్ట్రాల్‌ను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. అంటే ఆహారం ద్వారా లభించే కొలెస్ట్రాల్ రక్తంలో కొలెస్ట్రాల్‌ను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. గుడ్డులోని పచ్చసొన తింటే గుండెపోటు రాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
పచ్చసొనతో ప్రయోజనాలెన్నో..!
గుడ్డులోని పచ్చసొనతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చసొన తినడం మూలంగా శరీరంలో హెచ్‌డీఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. గుండె, మెదడును హెల్తీగా ఉంచుతాయి కోడిగుడ్లు. ఆరోగ్యంగా ఉన్న వారితో పాటు మధుమేహం, బీపీ లేని వారు కూడా రోజుకు మూడు కోడిగుడ్ల వరకు తినొచ్చు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఉడికించిన కోడిగుడ్డు బెటర్..
చాలా సమస్యలు గుడ్డు పచ్చసొనలో కాకుండా.. దానిని వండే విధానంలో ఉంటాయంటున్నారు. వెన్న, క్రీమ్ లేదా ఎక్కువ నూనెలో తయారుచేసిన గుడ్డు వంటకాలు జీర్ణ సమస్యలను, కొవ్వును పెంచుతాయని చెప్తున్నారు. కాబట్టి గుడ్డును ఆరోగ్యకరమైన మార్గంలో ఉడికించడం ముఖ్యం. ఉడికించిన గుడ్డులో 77 కేలరీలు, 3.5 గ్రాముల మొత్తం కొవ్వు, 1.6 గ్రాముల సంతృప్త కొవ్వు, 186 mg కొలెస్ట్రాల్, 62 mg సోడియం, 0.56 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 0.56 గ్రాముల చక్కెర, 6.3 గ్రాముల ప్రోటీన్ లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు గుడ్డులో విటమిన్ ఎ, డి, ఇ, కె, అనేక రకాల విటమిన్ బి లు మంచి మొత్తంలో లభిస్తాయంటున్నారు. కాబట్టి అపోహలను వీడి రోజుకు ఒక ఫుల్ ఎగ్ తినవచ్చని చెప్తున్నారు. కేవలం వైట్ మాత్రమే కాకుండా.. ఎల్లో కూడా ఆరోగ్యానికి మంచిదని.. చెప్తున్నారు. ఎక్కువ మోతాదులో తీసుకోవాలనుకుంటే వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram