Nidhhi Agerwal | ప్రభాస్ గురించి నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘డైట్ చెడగొట్టడంలో ఆయనే ఫస్ట్’!

Nidhhi Agerwal | తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో గ్లామర్‌తో పాటు నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచింది. సినిమాలతో పాటు సోషల్ మీడియా, పబ్లిక్ ఈవెంట్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారుతున్న నిధి, ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి నటించిన భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ విడుదలకు సిద్ధమవుతోంది.

  • By: sn |    movies |    Published on : Jan 02, 2026 9:20 AM IST
Nidhhi Agerwal | ప్రభాస్ గురించి నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘డైట్ చెడగొట్టడంలో ఆయనే ఫస్ట్’!

Nidhhi Agerwal | తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో గ్లామర్‌తో పాటు నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచింది. సినిమాలతో పాటు సోషల్ మీడియా, పబ్లిక్ ఈవెంట్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారుతున్న నిధి, ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి నటించిన భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ విడుదలకు సిద్ధమవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో నిధి అగర్వాల్‌పై స్పాట్‌లైట్ మరింతగా పెరిగింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి నిధి అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హీరోయిన్లకు మితాహారం చాలా పెద్ద పరీక్ష. ఇష్టమైన ఫుడ్‌ను ధైర్యంగా తినలేం. కానీ ‘ది రాజా సాబ్’ సెట్స్‌లో మాత్రం కంట్రోల్ తప్పిపోయింది. అందుకు కారణం ప్రభాస్. ఎదుటివారి డైట్ చెడగొట్టడంలో ఆయనే ముందుంటారు” అంటూ నిధి నవ్వుతూ చెప్పుకొచ్చింది. ప్రభాస్ సెట్‌లో అందరికీ కడుపునిండా తినిపిస్తారని, రోజూ ఆయన ఇంటి నుంచి వచ్చే క్యారియర్‌లో పది రకాల వంటకాలు ఉండేవని తెలిపింది. వాటి వాసన చూసినప్పుడల్లా తినకుండా ఉండలేకపోయేవారమని చెప్పింది. అయితే ప్రభాస్ మాత్రం తాను ఫ్రూట్స్ మాత్రమే తింటారని వెల్లడించింది. “ఎదుటివారికి తినిపించి ఆనందపడే మనసు ప్రభాస్‌ది” అంటూ ఆయన మనసు గొప్పతనాన్ని కొనియాడింది.

ఇక నిధి అగర్వాల్ నేపథ్యాన్ని పరిశీలిస్తే, ఆమె హైదరాబాద్‌లో జన్మించి బెంగళూరులో పెరిగింది. మార్వారీ కుటుంబానికి చెందిన ఆమె తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ప్రావీణ్యం కలిగి ఉంది. క్రైస్ట్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నిధి, బాలెట్ డ్యాన్స్‌లో శిక్షణ పొందింది. మిస్ దివా యూనివర్స్ 2014లో పాల్గొన్న తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ‘మున్నా మైఖేల్’తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసి జీ సినీ అవార్డు అందుకుంది.తెలుగులో ‘సవ్యసాచి’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నిధి, ఇప్పుడు ‘ది రాజా సాబ్’తో తన కెరీర్‌లో కీలక మలుపు తిరగనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.