IRCTC Nepal Muktinath Yatra | హిమాలయాల్లో ఆధ్యాత్మిక యాత్ర.. నేపాల్ ముక్తినాథ్ టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చిన ఐఆర్‌సీటీసీ!

IRCTC Nepal Muktinath Yatra | ఈ సమ్మర్‌లో హిమాలయాల అందాలను ఆస్వాదిస్తూ.. ఆధ్యాత్మిక యాత్ర చేయాలని అనుకుంటున్న వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది.

IRCTC Nepal Muktinath Yatra | ఈ సమ్మర్‌లో హిమాలయాల అందాలను ఆస్వాదిస్తూ.. ఆధ్యాత్మిక యాత్ర చేయాలని అనుకుంటున్న వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. నేపాల్ ముక్తినాథ్ యాత్ర పేరిట ఒక టూర్ ప్యాకేజీని అందుబాటులో ఉంచింది. దీని ద్వారా నేపాల్‌లోని పవిత్ర ముక్తినాథ్ ఆలయంతో పాటు పశుపతినాథ్, బౌద్ధనాథ్ వంటి ప్రదేశాలను ఒకేసారి దర్శించే అవకాశం కల్పించింది.

ఈ టూర్‌లో భాగంగా కాఠ్మాండూ, పోఖ్రా, ముక్తినాథ్ వంటి ప్రాంతాలను సందర్శించవచ్చు. ఏప్రిల్ 27వ తేదీన ఈ యాత్ర మొదలవుతుంది. మొత్తం ఆరు రాత్రులు, ఏడు రోజుల పాటు ఈ టూర్ సాగనుంది.

ప్యాకేజీ ధర వివరాలు

సింగిల్ ఆక్యూపెన్సీ అయితే ఒక్కొక్కరికీ రూ.80,750 ఐఆర్‌సీటీసీ వసూలు చేస్తుంది. డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.75,950; ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.74,700 చార్జి చేస్తుంది. ఇక పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.74,050; బెడ్ లేకుండా రూ.65,100 చార్జి చేస్తుంది.

రోజువారీ టూర్ షెడ్యూల్ ఇదీ

మొదటి రోజు: కోయంబత్తూర్ ఎయిర్‌పోర్టు నుంచి రాత్రి 9 గంటలకు ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది. ముందుగా ఢిల్లీ వెళ్లి.. అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కి కాఠ్మాండ్ చేరుకుంటారు.

రెండో రోజు: ఉదయం కాఠ్మాండ్ చేరుకుని, ముందుగా హోటల్‌కు వెళ్తారు. ఫ్రెషప్ అయిన తర్వాత సిటీ టూర్‌కు వెళ్తారు. పశుపతి నాథ్ ఆలయం, బౌద్ధనాథ్ స్తూపాన్ని దర్శించుకుంటారు. రాత్రికి కాఠ్మాండ్‌లోనే బస ఉంటుంది.

మూడో రోజు: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం ఫోఖరాకు రోడ్డు మార్గంలో బయల్దేరతారు. దారిమధ్యలో అన్నపూర్ణ పర్వత శ్రేణులను సందర్శిస్తారు. మాణకమ్మ ఆలయాన్ని కేబుల్ కార్ ద్వారా వెళ్లి దర్శించుకుంటారు. అనంతరం ఫోఖరాకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస ఉంటుంది.

నాలుగో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం ఫోఖరా నుంచి జోంసోమ్ వరకు వెళ్తారు. అక్కడ ముక్తినాథ్ ఆలయాన్ని దర్శించుకుంటారు. 108 జలధారల వద్ద పవిత్ర స్నానం ఆచరిస్తారు. హిమాలయాల మధ్యలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ఇది మంచి టైమ్. రాత్రికి జోంసోమ్ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస ఉంటుంది.

ఐదో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం పోఖరా సైట్ సీయింగ్‌కు బయల్దేరతారు. దేవీస్ ఫాల్స్, గుప్తేశ్వర్ మహాదేవ్ గుహా, బింద్యాబాసిని ఆలయం సందర్శిస్తారు. పోఖరా సరస్సు వద్ద కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. రాత్రికి పోఖరాలోనే బస ఉంటుంది.

ఆరో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం కాఠ్మాండ్ బయల్దేరతారు. హోటల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత లోకల్ మార్కెట్‌లో షాపింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. కావాలనుకుంటే కాసినోకు కూడా వెళ్లవచ్చు. సాయంత్రం బౌద్ధనాథ్ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక రాత్రికి కాఠ్మాండ్‌లోనే బస ఉంటుంది.

ఏడో రోజు: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరతారు. కాఠ్మాండ్‌ నుంచి ఢిల్లీకి.. అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా కోయంబత్తూరుకు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీలో ఉండే సదుపాయాలు

* విమాన టికెట్లు
* 3 స్టార్ హోటల్ వసతి
* బ్రేక్‌ఫాస్ట్+లంచ్+డిన్నర్
* ముక్తినాథ్ పర్మిట్ ఫీజులు
* లోకల్ ట్రాన్స్‌పోర్టు (AC వాహనం)
* టూర్ గైడ్
* ట్రావెల్ ఇన్సూరెన్స్

ప్యాకేజీలో లేని సదుపాయాలు

* అదనపు సైట్ సీయింగ్
* వ్యక్తిగత ఖర్చులు
* టిప్స్
* ఫ్లైట్ సర్‌చార్జ్‌లు

ముఖ్య నిబంధనలు

* కనీసం 6 నెలల వ్యాలిడిటీ పాస్‌పోర్టు ఉండాలి.
* 100 శాతం పేమెంట్ ముందుగా చేయాలి
* వీసా ఫ్రీ కానీ ఇతర చార్జీలు ఉండవచ్చు
* విమాన షెడ్యూల్ మారవచ్చు.

Read More:

IRCTC Saurashtra Tour | రూ.30వేలలోనే ద్వారక-సోమనాథ్ యాత్ర.. ఐఆర్‌సీటీసీ 8 రోజుల ఆధ్యాత్మిక ట్రిప్!

IRCTC Ooty Trip | రూ.15 వేలలోనే ఊటీ ట్రిప్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ!

Latest News