IRCTC Ooty Trip | రూ.15 వేలలోనే ఊటీ ట్రిప్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ!

IRCTC Ooty Trip | ఈ సమ్మర్‌లో ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వేయాలని అనుకుంటున్నారా? మీలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

  • By: Chandram |    news |    Published on : Apr 15, 2026 8:10 AM IST
IRCTC Ooty Trip | రూ.15 వేలలోనే ఊటీ ట్రిప్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ!

IRCTC Ooty Trip | ఈ సమ్మర్‌లో ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వేయాలని అనుకుంటున్నారా? మీలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. తక్కువ ఖర్చులోనే ఊటీ -కూనూర్ టూర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. పర్వతాల మధ్య పచ్చని ఛాయ్ తోటలు, మబ్బుల్లో తేలియాడే రహదారులను వీక్షించే అవకాశాన్ని కల్పించింది. ఈ ట్రిప్‌లో ప్రకృతి అందాలు మాత్రమే కాదు.. సరైన టైమ్‌ మేనేజ్‌మెంట్ మీ ట్రిప్‌ను మరింత మొమరేబుల్‌గా మారుస్తుందని అంటున్నారు.

ఊటీ ట్రిప్ ఎందుకు స్పెషల్

ఊటీ అనేది కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు.. అది ఒక ఎమోషన్. చల్లని వాతావరణం, సుందరమైన లోయలు, ఛాయ్ తోటలు, నీటి జలపాతాలు ఇవన్నీ విశేషంగా ఆకట్టుకుంటాయి. నీలగిరి పర్వతాల మధ్య అద్భుత దృశ్యాలు ఆహ్లాదాన్నిస్తాయి. ఫొటోగ్రఫీకి బెస్ట్ స్పాట్స్ కూడా ఉంటాయి. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు వెళ్లే హిల్ స్టేషన్లలో ఊటీ టాప్‌లో ఉంటుంది.

ఇక ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చిన ఈ ప్యాకేజీ‌లో భాగంగా ప్రతి మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి ఈ ట్రిప్ ప్రారంభమవుతుంది. 5 రాత్రులు, 6 రోజుల పాటు ఈ టూర్ కొనసాగనుంది.

ప్యాకేజీ వివరాలు

ఈ ఊటీ టూర్‌‌ను ఐఆర్‌సీటీసీ రెండు విభాగాల్లో ఆఫర్ చేస్తుంది. కంఫర్ట్ (3A) విభాగంలో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.33,590 చార్జి చేస్తుంది. ట్విన్ షేరింగ్ అయితే రూ.18,890; ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.17,170 వసూలు చేస్తుంది. ఇక పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.8840, బెడ్ లేకుండా అయితే రూ.6490 చార్జి చేస్తుంది.

ఇక స్టాండర్డ్ (స్లీపర్) విభాగంలో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.31,050 చార్జి చేస్తుంది. ట్విన్ షేరింగ్ అయితే రూ.16,360; ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.14,360 వసూలు చేస్తుంది. ఇక పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.6300, బెడ్ లేకుండా అయితే రూ.3950 చార్జి చేస్తుంది.

రోజువారీ షెడ్యూల్

మొదటి రోజు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.25 గంటలకు రైలు బయల్దేరుతుంది. శబరి ఎక్స్‌ప్రెస్‌(20629)లో ప్రయాణం ఉంటుంది.

రెండో రోజు: ఓవర్‌నైట్ జర్నీ అనంతరం ఉదయం 9.10 గంటలకు కోయంబత్తూర్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఊటీకి వెళ్తారు. హోటల్‌లో చెక్ఇన్ అయిన తర్వాత ఫ్రెషప్ అవుతారు. కాసేపు విశ్రాంతి అనంతరం మధ్యాహ్నం బొటానికల్ గార్డెన్, ఊటీ లేక్ తిరిగొస్తారు. సాయంత్రం చల్లటి గాలి మధ్య విశ్రాంతి తీసుకుంటారు. రాత్రికి ఊటీలోనే బస ఉంటుంది.

మూడో రోజు: హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ అనంతరం సైట్ సీయింగ్‌కు బయల్దేరతారు. దోడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకరా ఫాల్స్‌ను సందర్శిస్తారు. రాత్రికి ఊటీలోనే బస ఉంటుంది.

నాలుగో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం కూనూర్ సైట్‌సీయింగ్ బయల్దేరతారు. కూనూర్ టీ గార్డెన్‌, ఇతర ప్రాంతాలను సందర్శించుకుని రాత్రికి ఊటీ చేరుకుంటారు. అక్కడే బస ఉంటుంది.

ఐదో రోజు: మధ్యాహ్నం హోటల్‌ చెక్‌అవుట్ చేసి కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌కు బయల్దేరతారు. శబరి ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.

ఆరో రోజు: ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో ట్రిప్ ముగుస్తుంది.

ప్యాకేజీలో ఉండే సదుపాయాలు

* ప్యాకేజికి అనుగుణంగా రైలు టికెట్లు
* లోకల్ ట్రాన్స్‌పోర్టు (ఏసీ వాహనం)
* 3 రోజులు వసతి, బ్రేక్‌ఫాస్ట్
* ట్రావెల్ ఇన్సూరెన్స్

ప్యాకేజీలో లేని సదుపాయాలు

* లంచ్, డిన్నర్
* ఎంట్రీ టికెట్లు
* బోటింగ్, హార్స్ రైడింగ్
* వ్యక్తిగత ఖర్చులు

Read More:

IRCTC Andaman Tour | రూ.50వేలలోనే అండమాన్ ట్రిప్.. స్పెషల్ ట్రావెల్ ప్యాకేజీ తీసుకొచ్చిన ఐఆర్‌సీటీసీ!

IRCTC Shri Ramayana Yatra | అయోధ్య టు రామేశ్వరం.. 17 రోజుల్లో పూర్తి రామాయణ యాత్ర!