మంటల్లో తాజ్ ఎక్స్‌ప్రెస్‌ మూడు బోగీల్లో చెలరేగిన మంటలు ప్రయాణికులు క్షేమం

షార్ట్ సర్క్యూట్ కారణంగా తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్తున్న తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి, మూడు బోగీలు మంటల్లో దగ్ధమయ్యాయి.

మంటల్లో తాజ్ ఎక్స్‌ప్రెస్‌ మూడు బోగీల్లో చెలరేగిన మంటలు ప్రయాణికులు క్షేమం

విధాత : షార్ట్ సర్క్యూట్ కారణంగా తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్తున్న తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి, మూడు బోగీలు మంటల్లో దగ్ధమయ్యాయి. డీ 2,3,4బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రమాదం కారణంగా తుగ్లకాబాద్-ఓఖ్లా మధ్య రైలు నిలిపివేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. ఆరు అగ్నిమాపక యంత్రాలు రైలు బోగీల్లోని మంటలు ఆర్పేసేందుకు రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని, షార్ట్ సర్క్యూట్ కారణంగా రైలు బోగీల్లో మంటలు చెలరేగాయని రైల్వే డీసీపీ అతుల్ మల్హోత్ర, ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్‌లు తెలిపారు.