Accident | కర్ణాటకలో ఘోర ప్రమాదం.. 13 మంది ప్రయాణికులు సజీవదహనం
Accident | కర్ణాటకలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న సీబర్డ్ ప్రయివేటు ట్రావెల్స్ బస్సును వేగంగా దూసుకొచ్చిన కంటెయినర్ లారీ ఢీకొట్టింది.
బెంగళూరు : కర్ణాటకలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న సీబర్డ్ ప్రయివేటు ట్రావెల్స్ బస్సును వేగంగా దూసుకొచ్చిన కంటెయినర్ లారీ ఢీకొట్టింది. లారీ డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాద ఘటన జాతీయ రహదారి -48పై గోర్లత్తు క్రాస్ వద్ద గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు.
అగ్నికీలలు ఎగిసిపడిన సమయంలో బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదానికి అతివేగం, పొగమంచు కారణమని నిర్ధారించారు. అగ్నికీలలు కంటెయినర్‌కు కూడా వ్యాపించడంతో అది కూడా పాక్షికంగా కాలిపోయింది.
ఈ ప్రమాదం నుంచి బస్సు డ్రైవర్, కో డ్రైవర్ ఇద్దరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. కొంతమంది ప్రయాణికులు అద్దాలను పగులగొట్టి బయటకు దూకారు. మృతుల్లో కొందరిని గుర్తించారు. మంజునాథ్, సంధ్య, శశాంక్, దిలీప్, ప్రీతిశ్వరన్, వి బిందు, కే కవిత, అనిరుధ్ బెనర్జీ, అమృత, కల్పన, ప్రజాపతి, ఎం శశికాంత్, విజయ్ భండారీ, నవ్య, అభిషేక్, కిరణ్ పాల్, కీర్తన్ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram