విధాత : భారత్ లో క్రికెట్ క్రేజ్ చిన్నారుల నుంచి పెద్దల వరకు అంతా ఒక్కటే. బ్యాటు, బాల్ కనబడితే చాలు ఆట ఆడాల్సిందేనన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. దేశంలో ఏ మూల వెళ్లినా గల్లీల్లో, పొలాల్లో, కాలనీల్లో క్రికెట్ ఆడే పిల్లలను చూస్తుంటాం. ఐపీఎల్ క్రికెట్ టోర్నీతో దేశంలో క్రికెట్ మానియా మరింత పెరిగిపోయింది.
నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ 15ఏళ్ల లోపే ఐపీఎల్ లో అడుగుపెట్టి వరుస సీజన్లలో ఆడుతూ.. ప్రపంచ స్థాయి బౌలర్లను తన పవర్ హిట్టింగ్ తో ఉతికి ఆరేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ బాటలోనే దేశంలో అనేక మంది బాలబాలికలు క్రికెట్ లో చిన్న వయసు నుంచే ధనాధన్ షాట్లతో విరుచుక పడుతున్న వీడియోలు అనేకం తరచూ వెలుగుచూస్తున్నాయి.
ఆదివారం ఓ వైపు ఐపీఎల్ -2026 ఫైనల్ పోటీ ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగబోతున్న సమయంలో ఓ బాలుడి హార్డ్ హిట్టింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆర్సీబీ జెర్సీ వేసుకున్న 4 ఏళ్ల పిల్లాడు బాక్స్ క్రికెట్‌లో పవర్‌ఫుల్ షాట్లతో చెలరేగుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. భారీ షాట్లు ఆడటంలో అతని టైమింగ్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ బాలుడి ధనాధన్ క్రికెట్ ఆటను చూసిన నెటిజన్లు భారత్ క్రికెట్ లోతైన బలాన్ని, భవిష్యత్ ఆటగాళ్ల సామర్ధ్యానికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చని అభివర్ణిస్తున్నారు.
ఆర్సీబి జెర్సీ వేసుకున్న 4 ఏళ్ల పిల్లాడు బాక్స్ క్రికెట్‌లో పవర్‌ఫుల్ షాట్లతో చెలరేగుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అతని టైమింగ్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. pic.twitter.com/Tid14kR5aj
— TG Govt Updates (@TGGovtUpdates) May 31, 2026
