Snake Catcher | పాముల‌ను ప‌ట్టిన ప‌డుచు పిల్ల‌.. చీర‌లో ఆమె వయ్యారం చూస్తే మ‌తి పోవాల్సిందే..!

Snake Catcher | పాముల‌ను( Snakes ) చూసినా.. వాటి పేరు విన్నా.. గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. ఒళ్లంతా చెమ‌టలు ప‌డుతాయి. అటు నుంచి ప‌రుగెత్తుతాం. కానీ ఓ ప‌డుచు పిల్ల( Young Woman ) మాత్రం.. ఓ రెండు పాముల‌ను క‌ళ్లు మూసి తెరిచేలోగా.. అవ‌లీల‌గా ప‌ట్టేసింది. ఆ పిల్ల పాములు ప‌ట్టిన విధానం చూస్తే మ‌తి పోవాల్సిందే.

  • By: raj |    national |    Published on : Oct 12, 2025 10:00 AM IST
Snake Catcher | పాముల‌ను ప‌ట్టిన ప‌డుచు పిల్ల‌.. చీర‌లో ఆమె వయ్యారం చూస్తే మ‌తి పోవాల్సిందే..!

Snake Catcher | ఓ అమ్మాయి.. యుక్త వ‌య‌సులో( Young Girl ) అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. అంతేకాదు గులాబీ రంగులో ఉన్న చీర( Pink Colour Saree ) ధ‌రించడంతో.. ఆ యువ‌తికి మ‌రింత అందంగా క‌నిపించింది. త‌న కురుల‌తో మైమ‌రిపిస్తూ.. నాజుకైన న‌డుముతో వ‌య్యారాలు వ‌ల‌క‌బోస్తూ.. ఓ గ‌దిలోకి ప్ర‌వేశించింది.

కానీ ఆ ప‌డుచు పిల్ల చేసిన ప‌నికి షాక్ అవ్వాల్సిందే. ప‌లు వ‌స్తువుల‌తో నిండిపోయిన ఓ గ‌దిలోకి ప్ర‌వేశించిన ఆ అమ్మాయి.. పాముల‌ను( Snakes ) ప‌ట్టేసింది. భారీ పొడ‌వుగా ఉన్న రెండు పాముల‌ను క్ష‌ణాల్లోనే త‌న నైపుణ్యంతో బంధించింది ఆమె. ఆ పాముల‌ను ఆమె ప‌ట్టిన తీరు చూస్తే ప్ర‌తి ఒక్క‌రికి మ‌తి పోక త‌ప్ప‌దు.

అయితే ఆ యువ‌తి ప‌ట్టుకున్న రెండు పాములు కూడా విష‌ర‌హిత స‌ర్పాలు( Non-Venomous Rat Snakes )  అని తేలింది. మ‌న‌షుల‌కు ఈ పాముల నుంచి ఎలాంటి హానీ ఉండ‌ద‌ని పేర్కొన్నారు. ఇక రెండు పాముల‌ను ఓ డ‌బ్బాలో వేసుకుని, అనంత‌రం వాటిని అడ‌వుల్లో వ‌దిలేసింది ఆ ప‌డుచుపిల్ల‌.

ఇక పాముల‌ను ప‌డుచు పిల్ల ప‌ట్టిన తీరుపై నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా కామెంట్ చేశారు. ఆ అమ్మాయి రెడీ అయిన విధానం చూస్తే ఏదో ఫొటో షూట్‌కు వెళ్తుంద‌నుకున్నాం. తీరా పాములు ప‌ట్టేస‌రికి షాక్ అయ్యామ‌ని ఓ నెటిజ‌న్ పేర్కొన్నాడు. గులాబీ రంగు చీర‌లో త‌న న‌డుము, నాభి అందాల‌ను చూపిస్తూ పాముల‌ను బంధిస్తుంటే అలానే చూడాల‌నిపిస్తుంద‌ని మ‌రో నెటిజ‌న్ త‌న అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

ప‌డుచుపిల్ల పాములు ప‌ట్టిన దృశ్యాలను సైబా అనే ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి మీరు కూడా ఆ వీడియోపై లుక్కేయండి.