నాగుపామును పట్టుకుని..నీళ్లు తాగించాడు!
తిరుపతి జిల్లా పుత్తూరులో ఇంట్లోకి వచ్చిన నాగుపామును స్నేక్ క్యాచర్ పట్టుకుని దానికి నీళ్లు తాగించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విధాత : పాముల జాతులలో కోబ్రా రకం నాగుపాములు ప్రాణాంతకమైప విషం కలిగి అత్యంత డేంజర్ స్నేక్స్ గా గుర్తింపు పొందాయి. అలాంటి నాగు పామును ఓ స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టుకోవడంతో పాటు ఎండల ధాటికి దాహంతో అలమటిస్తున్న దానికి నీళ్లు తాగించిన వీడియో వైరల్ గా మారింది.
తిరుపతి జిల్లా పుత్తూరులో ఓ ఇంట్లోకి నాగుపాము చొరబడింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ వాటర్ ట్యాంకు కింద దాగిన నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నాడు. ఎండ తీవ్రతకు అల్లాడుతున్న ఆ పాముకు ఆయన నీళ్లు తాగించగా, అది సేద తీరింది. అనంతరం ఆ నాగు పామును అతను అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. వేసవిలో పాములు ఇళ్లలోకి రావచ్చని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తిరుపతి జిల్లా పుత్తూరులో దాహంతో ఒక నాగుపాము ఇంట్లోకి వచ్చింది. స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ దాన్ని పట్టుకుని నీళ్లు తాగించి, తర్వాత అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. వేసవిలో పాములు ఇళ్లలోకి రావచ్చని అప్రమత్తంగా ఉండాలని సూచించారు..#Tirupati #SnakeRescue #APNews #SummerAler pic.twitter.com/3Rqucu4pjp
— Jana tanthram (@janatanthram) April 7, 2026
ఇవి కూడా చదవండి :
వైరల్ గా.. నల్లగొండ కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాల!
తేయాకు తోటలో దానిని చూసి పరుగే పరుగు!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram