అంబానీ బెదిరింపు కేసులో నిందితుడి అరెస్టు

విధాత : ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానికి వరస బెదిరింపు మెయిల్స్ పంపిన కేసులో ముంబై పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మెయిల్ ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలంగాణ నుంచి షాదాబ్ ఖాన్ పేరుతో బెదిరింపు మెయిల్ చేసి 19 ఏండ్ల గణేష్ వనపర్తిని గుర్తించి అరెస్టు చేశారు.
కాగా.. న్యాయస్థానం అతడికి నవంబర్ 8వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది. తొలుత అక్టోబర్ 27న బెదిరింపు మెయిల్లో 20 కోట్లు ఇవ్వాలని లేకపోతే చంపేస్తామని నిందితుడు పేర్కోన్నాడు. తర్వాత 200 కోట్లు ఇవ్వాలని, ఆ తర్వాత 400 కోట్లు ఇవ్వాలని నిందితుడు డిమాండ్ చేశాడు.
దీనిపై ముఖేష్ అంబానీ సెక్యూరిటీ ఇన్చార్జి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత ఏడాది కూడా అంబానీ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి 2022 రెండు ఆగస్టు 15వ తేదీన ఓ వ్యక్తి రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న హరికిషన్ దాస్ ఆసుపత్రికి బెదిరింపు ఫోన్ చేశారు. ఆ సందర్భంగా కూడా కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేశారు.
2021లో అంబానీ నివాసం అంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఒక స్కార్పియో కారణం గుర్తించారు. స్కార్పియో యజమాని మన్సూర్ హీరాన్ కొద్దిరోజులకే అనుమానస్పద పరిస్థితిలో చనిపోయారు. ఈకేసులో దర్యాప్తు అధికారి ఇన్స్పెక్టర్ సచిన్ వాజే ప్రధాన సూత్రధారిగా తేలారు. దీంతో ఎన్ఐఏ అధికారులు ఆయన అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ముఖేష్ అంబానికి ఆయన కుటుంబ సభ్యులకు భద్రత కల్పిస్తుంది.