Sayaji Shinde | రాజ‌కీయాల్లోకి న‌టుడు షాయాజీ షిండే.. మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ..!

Sayaji Shinde | టాలీవుడ్, బాలీవుడ్‌లో విల‌క్ష‌ణ న‌ట‌న‌తో సినీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన షాయాజీ షిండే( Sayaji Shinde ) రాజ‌కీయ అరంగేట్రం చేశారు. నేష‌న‌లిస్టు కాంగ్రెస్ పార్టీ( Nationalist Congress party )లో చేరిన షిండే.. మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో( Maharashtra Assembly Elections ) పోటీ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Sayaji Shinde | రాజ‌కీయాల్లోకి న‌టుడు షాయాజీ షిండే.. మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ..!

Sayaji Shinde | ప్ర‌ముఖ న‌టుడు షాయాజీ షిండే( Sayaji Shinde ) రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టారు. త‌న విల‌క్ష‌ణ న‌ట‌న‌తో అంద‌ర్ని మెప్పించే షిండే.. అజిత్ ప‌వార్( Ajit Pawar ) నేతృత్వంలోని నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ( Nationalist Congress party )లో చేరారు. మహారాష్ట్ర( Maharashtra ) రాజ‌ధాని ముంబై( Mumbai ) న‌గ‌రంలో ఎన్సీపీ చీఫ్‌( NCP Chief ), మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ స‌మ‌క్షంలో షాయాజీ షిండే పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా షిండేకు అజిత్ ప‌వార్ ఎన్సీపీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

త్వ‌ర‌లోనే మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు( Maharashtra Assembly Elections ) జ‌ర‌గ‌నున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో షిండే పోటీ చేస్తార‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి. అయితే పార్టీలో ఆయ‌న‌కు త‌గిన ప్రాధాన్యం క‌ల్పిస్తామ‌ని అజిత్ ప‌వార్ వెల్ల‌డించారు. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున స్టార్ క్యాంపెయిన‌ర్‌గా షిండే బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తార‌ని ప‌వార్ స్ప‌ష్టం చేశారు.

ఎన్సీపీలో చేరిక సంద‌ర్భంగా షిండే మాట్లాడుతూ.. తాను ఎన్నో సినిమాల్లో రాజ‌కీయ నాయ‌కుడిగా న‌టించాన‌ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు నిజ జీవితంలో రాజ‌కీయ నాయకుడిగా త‌న పాత్ర‌ను నిర్వ‌ర్తించ‌బోతున్నామ‌ని తెలిపారు. అజిత్ ప‌వార్ న‌డ‌వ‌డిక త‌న‌ను ఎంతో ఆక‌ర్షించింద‌న్నారు. పార్టీలో స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేసేందుకే కృషి చేస్తాన‌ని షాయాజీ షిండే తెలిపారు.