Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఆ డాక్టర్ దంపతుల చివరి సెల్ఫీ ఇదే..
Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash )లో ఓ డాక్టర్ కుటుంబం( Doctor Family ) సజీవదహనమైంది. తమ ముగ్గురు పిల్లలతో కలిసి లండన్( London ) వెళ్తున్న ఆ డాక్టర్ దంపతుల కలలు బుగ్గి పాలయ్యాయి. విమానంలో వారు చివరిసారిగా తీసుకున్న సెల్ఫీ ఒక్కటే ఆ కుటుంబానికి జ్ఞాపకంగా మిగిలిపోయింది.

Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు( Ahmedabad Airport ) నుంచి లండన్( London ) బయల్దేరిన ఎయిరిండియా విమానం.. టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాల్లోనే బీజే మెడికల్ కాలేజీ( BJ Medical College )హాస్టల్ భవనంపై కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 241 మంది సజీవదహనం కాగా, ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్టు ఎయిరిండియా ప్రకటించింది.
అయితే సజీవ దహనమైన ప్రయాణికుల్లో ఓ డాక్టర్ ఫ్యామిలీ( Doctor Family ) ఉంది. టేకాఫ్‌కు కొన్ని క్షణాల ముందు ఆ కుటుంబం తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ డాక్టర్ కుటుంబం చివరి సెల్ఫీ ఇదే అని బంధువులు తెలిపారు. జీవితంలో మరింత గొప్పగా ఎదగాలనుకున్న ఆ కుటుంబం.. ఇలా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందరిని కలిచివేస్తుంది.
రాజస్థాన్( Rajasthan )లోని బన్స్‌వారాకు చెందిన ప్రతీక్ జోషి( Prateek Joshi ) వృత్తిరీత్యా డాక్టర్. ఆయన భార్య కోమి వ్యాస్( Komi Vyas ) కూడా డాక్టరే. ప్రతీక్ జోషి కొంత కాలం క్రితం లండన్ వెళ్లి.. అక్కడ డాక్టర్‌గా పని చేస్తున్నారు. భార్య కోమి వ్యాస్.. ఉదయ్‌పూర్‌లోని పసిఫిక్ హాస్పిటల్( Pacific Hospital )లో పని చేస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. అయితే లండన్ నుంచి ఇటీవలే ప్రతీక్ జోషి తిరిగొచ్చాడు. ఇక తన భార్యాపిల్లలను కూడా లండన్ తీసుకెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరాడు. విమానం టేకాఫ్‌కు ముందు కుటుంబ సభ్యులతో కోమి వ్యాస్ సెల్ఫీ దిగింది. ఆ ఫొటోను బంధువులకు చేరవేయడంతో.. అదే చివరి సెల్ఫీగా మారింది.
కోమి వ్యాస్ కూడా లండన్‌లో డాక్టర్‌గా స్థిరపడాలనే ఉద్దేశంతో.. ఇటీవలే పసిఫిక్ హాస్పిటల్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇక ప్రతీక్ తండ్రి ప్రముఖ రేడియాలజిస్ట్, కాగా కోమి తండ్రి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ఆఫీసర్‌గా పని చేస్తున్నారు.